- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వైసీపీ సర్కార్ పార్కుల అభివృద్ధిని అటకెక్కించింది.. మంత్రి నారాయణ
ఐదేళ్ల పాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ సర్కార్ (YCP Government) పార్కుల అభివృద్ధిని పూర్తిగా అటకెక్కించిందని పట్టణ, పురపాలక శాఖ మంత్రి నారాయణ (Minister Narayana) అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ఐదేళ్ల పాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ సర్కార్ (YCP Government) పార్కుల అభివృద్ధిని పూర్తిగా అటకెక్కించిందని పట్టణ, పురపాలక శాఖ మంత్రి నారాయణ (Minister Narayana) అన్నారు. ఇవాళ ఆయన నెల్లూరు జిల్లా (Nellore District) అల్లిపురం (Allipuram)లో ఆయన పర్యటిస్తున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డ్, బయో మైనింగ్ రీసైక్లింగ్ యూనిట్‌ను పరిశీలించారు. రాష్ట్రంలో ప్రతి రోజు 6,500 టన్నుల చెత్త వస్తుందని, అక్టోబర్ 2 నాటికి రాష్ట్రంలోని చెత్తను క్లిన్ చేయాలని సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఆదేశించినట్లుగా పేర్కొన్నారు.
గతంలో చెత్త తొలగింపు కాంట్రాక్టులోనూ వైసీపీ సర్కార్ పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. అనంతరం ఆయన నెల్లూరులో తిక్కన పార్క్‌లో ప్లే, జిమ్ ఎక్విప్‌మెంట్‌ను ప్రారంభించారు. 2018లోనే 100 పార్కుల అభివృద్ధికి శ్రీకారం చుట్టామని.. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం పార్కుల అభివృద్ధిని అటకెక్కించిందని కామెంట్ చేశారు. ప్రజారోగ్య పరిరక్షణ, పిల్లల ఆహ్లాదం కోసం పార్కులను ఆధునీకరిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలోని పార్కులన్నీ ఆధునీకరించి సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేస్తామని మంత్రి నారాయణ అన్నారు.






