కోనసీమ జిల్లాపై ఫోకస్.. వైఎస్ జగన్ కీలక సమావేశం

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-05-19 17:32:59  IST  )

కోనసీమ జిల్లాపై వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఫోకస్ పెట్టారు...

కోనసీమ జిల్లాపై ఫోకస్.. వైఎస్ జగన్ కీలక సమావేశం
X

దిశ, వెబ్ డెస్క్: కోనసీమ జిల్లా(Konaseema District)పై వైసీపీ(Ycp) అధినేత జగన్ మోహన్ రెడ్డి(Jagan Mohan Reddy) ఫోకస్ పెట్టారు. ఎన్నికల తర్వాత నిరుత్సాహంలో ఉన్నఆ పార్టీ ప్రజా ప్రతినిధుల్లో ధైర్యం నింపుతూ వచ్చే ఎన్నికలపై పార్టీ అధినేత దిశానిర్దేశం చేస్తున్నారు. ఇందులో భాగంగా కోనసీమ జిల్లా స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో మంగళవారం వైఎస్ జగన్ భేటీ కాబోతున్నారు. రామచంద్రాపురం మున్సిపాలిటీ, పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మున్సిపాలిటీ, శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం, గ్రేటర్ విశాఖ మున్సిపల్‌ కార్పోరేషన్‌ (జీవీఎంసీ) కార్పోరేటర్లతో, వైసీపీ స్ధానిక సంస్ధల ప్రజా ప్రతినిధులతోనూ జగన్‌ తాడేపల్లి పార్టీ కార్యాలయంలో సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి ఎంపీపీలు, వైస్‌ ఎంపీపీలు, మున్సిపల్‌ చైర్‌ పర్సన్లు, మున్సిపల్‌ వైస్‌ ఛైర్ పర్సన్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లను ఆహ్వానించారు. వీరితో పాటు ఆయా జిల్లాలకు సంబంధించిన వైసీపీ ముఖ్య నాయకులు కూడా హాజరుకానున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, పార్టీ బలోపేతం, మున్సిపాలిటీ, కార్పొరేషన్ల ఎన్నికలపై దిశానిర్దేశం చేయనున్నారు.

Next Story