జగన్‌కు బిగ్ షాక్.. సత్తెనపల్లి పర్యటనకు నో పర్మిషన్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-06-16 14:56:33  IST  )

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి సత్తెనపల్లి పర్యటనకు ముందు బిగ్ షాక్ తగిలింది....

జగన్‌కు బిగ్ షాక్.. సత్తెనపల్లి పర్యటనకు నో పర్మిషన్
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి(Jagan Mohan Reddy)కి సత్తెనపల్లి పర్యటన(Sattenapalli tour)కు ముందు బిగ్ షాక్ తగిలింది. శాంతి భద్రతల దృష్ట్యా పల్నాడు జిల్లా పోలీసులు(Palnadu District Police) కీలక నిర్ణయం తీసుకున్నారు. జగన్ సత్తెనపల్లి పర్యటనకు అనుమతి నిరాకరించారు. తాము అడిగిన విధంగా పత్రాలు సమర్పిస్తే సత్తెనపల్లి పర్యటనకు అనుమతిచ్చే అంశంపై ఆలోచిస్తామని పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు(SP Srinivasa Rao) పేర్కొన్నారు.

కాగా ఈ నెల 18న సత్తెనపల్లిలో పర్యటించేందుకు జగన్ మోహన్ రెడ్డి షెడ్యూల్‌ను ప్రకటించారు. ఈ మేరకు స్థానిక వైసీపీ నాయకులు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అధినేత పర్యటనకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో వైసీపీ నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ అధినేతకు ప్రజల్లో ఆదరణ పెరుగుతోందనే అక్కశుతో టీడీపీ నాయకులే పోలీసులతో ఇలా చేయిస్తున్నారంటూ ఆరోపణలు చేస్తున్నారు. అయితే అన్ని పత్రాలు పోలీసులకు ఇచ్చి అనుమతి తీసుకోవాలని టీడీపీ నేతలు సూచిస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం జగన్ బుధవారం పర్యటన ప్రకటించారు. మరి మంగళవారం వైసీపీ నేతలు అన్ని పత్రాలు సమర్పిస్తారేమో చూడాలి.

Next Story