- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుపతి లడ్డూ vs ఇందాపూర్ డెయిరీ.. దద్దరిల్లిన మండలి
ఏపీ శాసనమండలిలో అధికార - విపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. దేవుడితో రాజకీయాలు చేస్తోంది మీరంటే మీరేనంటూ విమర్శలు గుప్పించుకున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ శాసనమండలిలో రెండ్రోజులుగా తిరుమల లడ్డూ, ఇందాపూర్ డెయిరీ అంశాలపై అధికార - విపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. బుధవారం మండలి సభలో కూడా ఇదే సీన్ కనిపించింది. విపక్ష నేతలు దేవుడిని రాజకీయంగా వాడుకుంటూ, ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారని హోంమంత్రి అనిత ఆరోపించారు. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ జరిగిందని సిట్ కూడా చెప్పిందన్నారు. అనిత వ్యాఖ్యలపై స్పందించిన ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ.. ప్రభుత్వమే శ్రీవారితో రాజకీయం చేస్తోందని ఆరోపించారు. తిరుమల లడ్డూ, ఇందాపూర్ డెయిరీ అంశాలపై చర్చకు ఎందుకు వెనకాడుతున్నారని ప్రశ్నించారు. ఇలా అధికార, విపక్షాల మధ్య జరిగిన మాటలయుద్ధంతో మండలి దద్దరిల్లింది. వైసీపీ సభ్యుల ఆందోళన మధ్యే చైర్మన్ మోషేను రాజు సభను రేపటికి వాయిదా వేశారు.
ఇందాపూర్ డెయిరీ హెరిటేజ్ దే
మండలి నుంచి బయటికి వచ్చిన అనంతరం బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. లోకేశ్ రాజీకాయాల పరంగా చూడాల్సింది, తెలుసుకోవాల్సింది చాలానే ఉందన్నారు. శత్రువు కూడా బలంగా ఉండాలని కోరుకునే వ్యక్తిని అన్నారు. లోకేష్ పై తనకు కోపం, ప్రేమ రెండూ లేవన్నారు. ఇందాపూర్ డెయిరీ కూడా హెరిటేజ్ వాళ్లదేనని, అందుకే దానిపై చర్చించేందుకు అంగీకరించడం లేదని బొత్స విమర్శించారు. తిరుమల లడ్డూ కల్తీ విషయంలో వాస్తవాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదన్నారు. ఇందాపూర్ డెయిరీని అడ్డుపెట్టుకుని టీటీడీని దోచుకుంటున్నారని ఆరోపించారు. కాగా.. అటు అసెంబ్లీలో నేను పలు కీలక బిల్లులకు సభ్యులు ఆమోదం తెలిపారు. అనంతరం అసెంబ్లీని కూడా స్పీకర్ అయ్యన్నపాత్రుడు రేపటికి వాయిదావేశారు.






