"2.O.. రప్పా రప్పా.. వైఎస్సార్‌" .. మళ్లీ రెచ్చిపోయిన వైసీపీ శ్రేణులు

by Naga Rani Yarlagadda |

వైసీపీ శ్రేణులు మరోసారి రప్పా రప్పా డైలాగ్ తో రెచ్చిపోయారు. గతంలో జగన్ పర్యటనలో రప్పా రప్పా నరుకుతాం అని వైసీపీ శ్రేణులు ఫ్లెక్సీలు ప్రదర్శించడం వాటిని జగన్ సమర్థించడం తీవ్ర దుమారానికి దారితీసిన విషయం తెలిసిందే.

2.O.. రప్పా రప్పా.. వైఎస్సార్‌ .. మళ్లీ రెచ్చిపోయిన వైసీపీ శ్రేణులు
X

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ శ్రేణులు మరోసారి రప్పా రప్పా డైలాగ్ తో రెచ్చిపోయారు. గతంలో జగన్ పర్యటనలో రప్పా రప్పా నరుకుతాం అని వైసీపీ శ్రేణులు ఫ్లెక్సీలు ప్రదర్శించడం వాటిని జగన్ సమర్థించడం తీవ్ర దుమారానికి దారితీసిన విషయం తెలిసిందే. తాజాగా కడప జిల్లాలో వినాయక నిమజ్జనంలో ఈ డైలాగ్ తో వైసీపీ శ్రేణులు అలజడి సృష్టించారు. ఎర్రగుండ్ల మండలం పెద్దనపాడు గ్రామంలో ఓ వినాయక విగ్రహం వెనుక 2.0 రప్పా రప్పా.. వైఎస్సార్ అని రాసి, కింద రెడ్ కలర్లో గొడ్డలి గుర్తును వేశారు. వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనానికి తీసుకెళ్తూనే పైపైకి ఎగరేస్తూ.. అల్లరి చేశారు. వైసీపీ అరాచకాలకు ఈ ఘటనొక నిదర్శనమంటున్నారు ప్రజలు. మూడ్రోజుల క్రితం జరిగిన ఈ నిమజ్జన ఊరేగింపు వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో.. పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ఈ ఘటనపై విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది.

Next Story