Atrocious:పెద్దాపురంలో టీడీపీ నేతపై కత్తులతో దాడి.. పరిస్థితి ఉద్రిక్తం

by Vemula.Srinu Prasad |

పెద్దాపురంలో టీడీపీ నేతపై వైసీపీ కార్యకర్తలు కత్తులతో దాడి చేశారు..

Atrocious:పెద్దాపురంలో టీడీపీ నేతపై కత్తులతో దాడి.. పరిస్థితి ఉద్రిక్తం
X

దిశ, వెబ్ డెస్క్: కాకినాడ జిల్లా పెద్దాపురం(peddapuram)లో దారుణం జరిగింది. టీడీపీ నేత జార్జ్ చక్రవర్తి(TDP leader George Chakravarthy)పై వైసీపీ నేతలు కత్తులతో దాడి చేశారు. దీంతో చక్రవర్తికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. దీంతో పెద్దాపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జార్జ్ చక్రవర్తిని చూసేందుకు ఆస్పత్రికి వద్దకు టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. తనకున్న 2.54 ఎకరాల భూమిని కాజేందుకే వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని చక్రవర్తి చెప్పినట్లు తెలిసింది. అయితే చక్రవర్తికి స్థానిక ఎమ్మెల్యే చినరాజప్ప అండగా నిలిచారు. అయితే చక్రవర్తిపై దాడి చేసిన వైసీపీ నేతలను కఠినంగా శిక్షించాలని పోలీస్ స్టేషన్ వద్ద టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

Next Story