- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మమ్మల్ని మనుషుల్లా చూడండి: పార్టీ మీటింగ్‌లో కార్యకర్త తీవ్ర ఆవేదన
తమను మనుషుల్లా చూడండని వైసీపీ కార్యకర్త రామ్మోహన్ రెడ్డి అన్నారు. ...

దిశ, వెబ్ డెస్క్: తమను మనుషుల్లా చూడండని వైసీపీ కార్యకర్త రామ్మోహన్ రెడ్డి(YSRCP leader Rammohan Reddy) అన్నారు. గుడివాడ కే.కన్వెషన్(Gudivada K.Convention)లో నిర్వహించిన వైసీపీ(Ycp) విస్తృత స్థాయి సమావేశంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఉన్న సమయంలో వాలంటీర్ల(Volunteers)కు ఇచ్చిన గౌరవం ఇవ్వలేదని, అందువల్లే 50 వేల ఓట్ల తేడాతో గుడివాడలో ఓడిపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో కార్యకర్తలు పని చేయకపోవడం వల్లే ఘోర ఓటమి తప్పలేదన్నారు. పార్టీకి, ప్రజలకు అనుసంధానం కార్యకర్తలేనని, ఇప్పటికైనా పార్టీ నాయకులు తెలుసుకోవాలన్నారు. కార్యకర్తలకు కాంట్రాక్టులు, డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని, తమను మనుషులిగా చూడండని సూచించారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో వాలంటీర్లకు ఇచ్చిన గౌరవం కార్యకర్తలకు ఇవ్వలేదని రామ్మోహన్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.






