జగన్ పర్యటనలో అపశృతి.. వైసీపీ కార్యకర్త మృతి

by Gantepaka Srikanth |

సీపీ అధినేత, ఏసీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇబ్రహీంపట్నం పర్యటనలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

జగన్ పర్యటనలో అపశృతి.. వైసీపీ కార్యకర్త మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ అధినేత, ఏసీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(YS Jagan) ఇబ్రహీంపట్నం పర్యటనలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న జగన్ రెడ్డికి స్వాగతం పలికేందుకు వెళ్ళి చిల్లకల్లు గ్రామ వైసీపీ కార్యకర్త రాంబాబు(45) మృతి చెందారు. జోగి రమేష్ ఇంటివద్ద పల్స్ పడిపోయి కుప్పకూలాడు. గమనించిన నేతలు.. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. మరోవైపు ఇబ్రహీంపట్నంలోని మాజీ మంత్రి జోగి రమేష్ నివాసానికి జగన్ చేరుకున్నారు. తాడేపల్లి నుంచి సుమారు ఆరు గంటల పాటు ప్రయాణించి జోగి రమేష్ ఇంటికి వచ్చారు. దాడిలో ధ్వంసమైన ఇంటిని జగన్ పరిశీలించారు.

జోగి రమేష్ ఇంటికి జగన్ పర్యటనపై విజయవాడ పోలీసులు ఆంక్షలు విధించారు. విజయవాడ నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు రూట్ మ్యాప్ మార్చాలని సూచిస్తూ విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. ప్రధాన రహదారులపై రాకపోకలు అధికంగా ఉండటంతో వెస్ట్ బైపాస్ మీదుగా జోగి రమేష్ నివాసానికి వెళ్లాలని సూచించారు. ట్రాఫిక్ మార్పులతో పాటు విజయవాడలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా పోలీసు బలగాలను మోహరించారు. నగరంలోకి ప్రవేశించే మార్గాలు ఇతర ప్రాంతాలలో పోలీసులు భారీ కేడ్లను ఏర్పాటు భద్రతను కట్టుదిట్టం చేశారు. మొత్తానికి జోగి రమేష్ ఇంటిపై దాడి ఘటనతో మొదలైన ఈ పరిణామాలు, స్వయంగా జగన్ రంగంలోకి దిగడం, మరోవైపు పోలీసుల ఆంక్షలు విధించడ కలిపి రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఉత్కంఠను రేపుతున్నాయి. ఈ పర్యటనతో అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ వాతావరణం మరింత వేడెక్కే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Next Story