- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
క్రికెట్ బెట్టింగ్‌పై దాడి: నలుగురి అరెస్ట్
వైఎస్ఆర్ జిల్లా కడపలో అక్రమ క్రికెట్ బెట్టింగ్ కార్యకలాపాలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు...

దిశ, కడప టౌన్: వైఎస్ఆర్ జిల్లా కడపలో అక్రమ క్రికెట్ బెట్టింగ్ కార్యకలాపాలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో నలుగురు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు. కడపకు చెందిన సంక కల్యాణ్, ఎల్లటూరు ప్రదీప్, కొడిదెల రహమత్ వల్లి, దొంతల రాహుల్ రెడ్డి నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి మొత్తం రూ.17,98,500 నగదు, నేరానికి ఉపయోగించిన 4 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు..
జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డి.ఎస్.పి పర్యవేక్షణలో అక్రమ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో మార్చి 26న ఇన్స్పెక్టర్ టి. రెడ్డెప్ప, ఎస్సై మహమ్మద్ రఫీ, ఏఎస్ఐ పి. వెంకటేశ్వర్లు తదితర సిబ్బంది భగత్ సింగ్ పార్క్ సమీపంలోని సంగం ఫంక్షన్ హాల్ వద్ద దాడి నిర్వహించారు. దాడి సమయంలో నిందితులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద ఉన్న నగదు మరియు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే, మరికొందరు నిందితులు అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు తెలిపారు. వారిని త్వరలోనే పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కేసులో నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన ఇన్స్పెక్టర్ టి. రెడ్డెప్ప, ఎస్సై మహమ్మద్ రఫీ మరియు ఇతర పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.






