నల్లబజారుకు తెల్లబియ్యం.. అధికారులకు తెలిసి ఏం చేశారంటే..!

by Vemula.Srinu Prasad |

పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పడుతోంది. ..

నల్లబజారుకు తెల్లబియ్యం.. అధికారులకు తెలిసి ఏం చేశారంటే..!
X

దిశ, వెబ్ డెస్క్: పేదలకు(Poor) అందాల్సిన రేషన్ బియ్యం(Ration Rice) పక్కదారి పడుతోంది. ప్రభుత్వ ఆశయాన్ని కొందరు అక్రమార్కులు తుంగలో కలిపేస్తున్నారు. యదేచ్ఛగా రేషన్ బియ్యాన్ని నల్లబజారుకు తరలిస్తున్నారు. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా గోదాము(Warehouse) రేషన్ బియ్యాన్ని నిల్వ ఉంచారు. సమాచారం అందుకున్న అధికారులు మెరుపు దాడి చేశారు. అన్నమయ్య జిల్లా రాజంపేట-పుల్లంపేట(Rajampet-Pullampet) సరిహద్దు అటవీప్రాంతం వద్ద గోదాములో తనిఖీలు చేశారు. ప్రభుత్వ చౌక దుకాణంలోని బియ్యాన్ని వివిధ పేర్లతో బహిరంగ మార్కెట్‌కు తరలిస్తున్నట్లు గుర్తించారు. దీంతో బియ్యం బస్తాలను లెక్కిస్తున్నారు. అనంతరం ఈ గోదాము బాగోతం వెనుక ఉన్న చరిత్రను బయటకు లాగే అవకాశం ఉంది. ‘‘ఎంతకాలం నుంచి ఈ దందా సాగుతుంది. అసలు ఈ అక్రమానికి సూత్రదారులు ఎవరు..?.’’అనే కోణంలో దర్యాప్తు చేపట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం గోదాములో బియ్యం బస్తాలు లెక్క తేలుస్తున్నారు.

Next Story