అది మా అడ్దా.. వాళ్లది కాదు: ఎంపీ శబరి

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-08-09 13:15:25  IST  )

కడప జిల్లా పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక ప్రచారం ముమ్మరంగా సాగుతోంది...

అది మా అడ్దా.. వాళ్లది కాదు: ఎంపీ శబరి
X

దిశ, వెబ్ డెస్క్: కడప జిల్లా పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక(Zptc By Election) ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. తమ అభ్యర్థులకు ఓట్లు వేయాలంటూ టీడీపీ(Tdp), వైసీపీ(Ycp) నేతలు ఓట్లు అడుగుతున్నారు. పులివెందుల్లో సత్తా చాటాలని రెండు పార్టీలు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాయి. సాంప్రదాయంగా పులివెందుల తమ అడ్డా అని, అక్రమంగా గెలిచేందుకు టీడీపీ నేతలు ప్రయత్నం చేస్తున్నారని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే పులివెందులలో ఎలాగైనా సరే జెండా ఎగరవేస్తామని టీడీపీ శ్రేణులు దీమా వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతా రెడ్డి తరపున ఎంపీ బైరెడ్డి శబరి(Mp Baireddy Sabari) పులివెందుల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పులివెందుల జగన్ అడ్డా కాదని, తెలుగుదేశం పార్టీ కంచుకోట కాబోతోందన్నారు. టీడీపీ సభ్యులంతా పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో పాల్గొటారని తెలిపారు. గత ఐదేళ్లు సీఎంగా ఉన్న జగన్ మోహన్ రెడ్డి పులివెందులకు ఏం చేశారో తెలపాలని చెప్పారు. కడప స్టీల్ ప్లాంట్ అని చెప్పి ఒక్క ఇటుక కూడా పెట్టలేదని విమర్శించారు. కేంద్రం నుంచి కొప్పర్తికి రూ. 1500 కోట్లు విడులైతే ఆ డబ్బులను మళ్లించారని ఆరోపించారు. గత ఐదేళ్ల పాటు వైసీపీ నేతలకు దోచుకోవడం తప్ప పులివెందులకు ఏమీ చేయలేదని బైరెడ్డి శబరి విమర్శించారు.

Next Story