ప్రొద్దుటూరులో ఉద్రిక్తత.. టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య ఘర్షణ

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-07-12 08:17:39  IST  )

టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య ఘర్షణతో కడప జిల్లా ప్రొద్దుటూరులోని మట్టిపాడు రోడ్డులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రోడ్డు విషయంలో స్థానిక టీడీపీ నేత కొండారెడ్డి, వైసీపీ నాయకుడు శివప్రసాద్ రెడ్డి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ...

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత.. టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య ఘర్షణ
X

దిశ, వెబ్ డెస్క్: టీడీపీ(Tdp), వైసీపీ(Ycp) నాయకుల మధ్య ఘర్షణతో కడప జిల్లా(Kadapa District) ప్రొద్దుటూరు(Proddutur)లోని మట్టిపాడు(Mattipadu) రోడ్డులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రోడ్డు విషయంలో స్థానిక టీడీపీ నేత కొండారెడ్డి, వైసీపీ నాయకుడు శివప్రసాద్ రెడ్డి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో ఇద్దరు నేతలు వాగ్వాదానికి దిగారు. రెండువర్గాలకు చెందిన కార్యకర్తలు భారీగా చేరుకోవడంతో పోలుసులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఘటన స్థలానికి వెళ్లారు. రెండు వర్గాల మధ్య జరుగుతున్న తోపులాటను అడ్డుకున్నారు. అనంతరం చెదరగొట్టారు. కొండారెడ్డి, శివప్రసాద్ రెడ్డితో మాట్లాడి వివాదాన్ని సర్దుమనిగించారు. మళ్లీ ఉద్రికత్తలకు దారి తీసేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. స్థానికంగా పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.

Next Story