కడపలో చంద్రబాబుకు నిరసన సెగ

by Javid Pasha |

కడప పర్యటనలో ఉన్న చంద్రబాబును కొందరు దళితులు అడ్డుకున్నారు.

కడపలో చంద్రబాబుకు నిరసన సెగ
X

దిశ, కడప: మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు కడపలో నిరసన సెగ ఎదురైంది. తెలుగుదేశం పార్టీ జోన్ 5 సమావేశానికి వచ్చిన చంద్రబాబుకు ఆయన వెళ్ళే మార్గంలో నిరసన తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళిత నేత పులి సునీల్ కుమార్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. నల్లజెండాలతో వారు నిరసన వ్యక్తం చేశారు. దళితులను కించపరిచేలా మాట్లాడిన లోకేష్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. విదేశీ విద్య వల్ల దళితులు పీకిందేమి లేదు.. చేసిందేమీ లేదని లోకేష్ వ్యాఖ్యానించడం పట్ల వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో దళితుల పట్ల చంద్రబాబు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారని, తాజాగా లోకేష్ కూడా దళితులను అవమానించేలా మాట్లాడారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా పోలీసులు నిరసనకు దిగిన ఆందోళనకారులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Next Story