- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బద్వేల్లో రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి
కడప జిల్లాలోని బద్వేలు పట్టణంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది.

దిశ, బద్వేలు: కడప జిల్లాలోని బద్వేలు పట్టణంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. పట్టణంలోని జాతీయ రహదారి–67పై టీఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఒక యువకుడు మృతి చెందగా, మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం ప్రకారం రాజుగారి వీధికి చెందిన చరణ్ అనే యువకుడికి ప్రమాదంలో తలకు బలమైన గాయమైంది. దాని వల్ల తీవ్ర రక్తస్రావం జరిగింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే 108 ఆంబులెన్సుకు సమచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఆంబులెన్స్ లో బాధితులను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న క్రమంలో చరణ్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ప్రమాదంలో గాయపడిన మరో యువకుడికి ఆసుపత్రిలో చికిత్సను అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొన్నారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో చరణ్ కుటుంబంతో పాటు రాజుగారి వీధిలో విషాద ఛాయలు అలుముకున్నాయి.






