Kadapa: శంకరాపురంలో ఆసక్తికర ఘటన

by Vemula.Srinu Prasad |

వైయస్సార్ జిల్లా కడప శంకరాపురంలో ఆసక్తికర ఘటన జరిగింది. ..

Kadapa: శంకరాపురంలో ఆసక్తికర ఘటన
X

దిశ, కడప: వైయస్సార్ జిల్లా కడప శంకరాపురంలో ఆసక్తికర ఘటన జరిగింది. లక్ష్మీదేవి (అలియాస్ ఎల్లమ్మ) అనే మహిళ పదేళ్ల నుంచి చిట్టీల వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఆమె వద్ద చాలా మంది చిట్టీలు వేశారు. అయితే కొద్ది నెలలుగా లక్ష్మీదేవి చిట్టీ డబ్బులు ఇవ్వడంలేదు. దీంతో ఆమె నుంచి డబ్బులు వసూళ్లు చేసేందుకు బాధితులు తీవ్రంగా ప్రయత్నం చేశారు. కానీ డబ్బులు ఇవ్వకపోవడంతో నారాయణ అనే వ్యక్తి పోలీస్ స్టేషన్‌లో చేశారు.


ఈ క్రమంలో నారాయణ మృతి చెందారు. దీంతో నారాయణ భార్య రాజేశ్వరి ఆందోళనకు దిగారు. చిట్టీ నిర్వాహకురాలు లక్ష్మీదేవి బంధువు రాజా ఎదుట నారాయణ మృతదేహంతో నిరసనకు దిగారు. లక్మీదేవి చేసిన మోసం వల్లే తన భర్త చనిపోయాడని ఆరోపించారు. తమకు న్యాయం చేసే వరకూ మృతదేహాన్ని తరలించేది లేదని ఆవేదన వ్యక్తం చేశారు.దీంతో పోలీసుల రాజేశ్వరితో మాట్లాడారు. న్యాయం చేయిస్తామని చెప్పడంతో ఆమె నిరసన విరమించినట్లు తెలుస్తోంది.

Next Story