గాలివీడు కేసు.. బంధువులే కుట్ర పన్ని హత్య

by Vemula.Srinu Prasad |

అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం ఒడిశవంక పల్లెలో జరిగిన రామకృష్ణారెడ్డి హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ...

గాలివీడు కేసు.. బంధువులే కుట్ర పన్ని హత్య
X

దిశ, వెబ్ డెస్క్: అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం ఒడిశవంక పల్లె వద్ద ఈనెల 17న రేషన్ డీలర్ రామకృష్ణారెడ్డి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నిందితులను గుర్తించారు. మహేశ్వర్‌రెడ్డి అనే వ్యక్తి సహా ఐదుగురిని అరెస్టు చేశారు. రామకృష్ణా రెడ్డి హత్యకు బంధువుల మధ్య భూతగాదాలే కారణమని పోలీసులు తేల్చారు. రామకృష్ణారెడ్డి బంధువు మహేశ్వర్‌రెడ్డి హత్యకు కుట్రపన్నారు. రూ.10 లక్షలు సుపారీ తీసుకుని రామకృష్ణారెడ్డిని నిందితులు కుళాయప్ప, పెద్దారెడ్డి, తిరుపతిరెడ్డి హత్య చేశారు. వీళ్లలో కుళాయప్ప, పెద్దారెడ్డి ఇంజినీరింగ్ విద్యార్థులుగా గుర్తించారు. రామకృష్ణారెడ్డిని చంపిన తర్వాత నిందితులకు మహేశ్వర్‌రెడ్డి రూ.5.50 లక్షలు ఇచ్చారు. మృతుడి భార్య ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు దర్యాప్తు చేశారు. హత్య జరిగిన చోట సీసీ ఫుటేజీ, సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా నిందితులను పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు. అనంతరం రిమాండ్‌కు తరలించారు.

కాగా వాకింగ్ చేస్తున్న రామకృష్ణారెడ్డిని నిందితులు హత్య చేసి పరారయ్యారు. కత్తులతో దాడి చేయడంతో రామకృష్ణారెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం కృష్ణారెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఆ తర్వాత కృష్ణారెడ్డి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. మృతుడి భార్య ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేసి నిందితులను కటకటాల్లోకి పంపారు పోలీసులు.

Next Story