మరో మేయర్ ఎన్నికకు ముహుర్తం ఫిక్స్.. త్వరలో నోటిఫికేషన్

by Thanuru Gopichand |   (  Updated:2025-12-04 15:27:27  IST  )

కడప నూతన మేయర్ ను ఎన్నుకునేందుకు మరోసారి నోటిఫికేషన్ విడుదలైంది.

మరో మేయర్ ఎన్నికకు ముహుర్తం ఫిక్స్.. త్వరలో నోటిఫికేషన్
X

దిశ, వెబ్ డెస్క్ : కడప నూతన మేయర్ ను ఎన్నుకునేందుకు మరోసారి నోటిఫికేషన్ విడుదలైంది. ఎమ్మెల్యే మాధవి రెడ్డి ఫిర్యాదుతో గత మేయర్ సురేశ్ బాబును కూటమి ప్రభుత్వం సెప్టెంబర్ నెలలో పదవీ బాధ్యతల నుంచి తప్పించింది. ఈ నేపథ్యంలో కడప మేయర్ స్థానానికి ఖాళీ ఏర్పడింది. ప్రస్తుతం డిప్యూటీ మేయర్ ముంతాజ్ బేగం ఇంచార్జి మేయర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్థానాన్ని భర్తీ చేసేందుకు రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం (AP State Election Commission) కడప మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవిలో ఏర్పడిన ఆకస్మిక ఖాళీని భర్తీ చేయడానికి ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్లకు ఈ ఎన్నికను నిర్వహించే ఎన్నికల అథారిటీగా వ్యవహరించడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నీలం సాహ్ని ఈ మేరకు ఆదేశాలను జారీ చేశారు. ఈ నెల 11వ తేదీన మేయర్ ఎన్నిక జరపాలని స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిర్ణయించింది.

అయితే గత మే నెలలో ఎమ్మెల్యే మాధవి రెడ్డి ఫిర్యాదు మేరకు అవినీతి ఆరోపణలపై మేయర్ సురేశ్ బాబును ప్రభుత్వం పదవి నుంచి తప్పించింది. దీనిపై సురేశ్ బాబు కోర్టుకు ఆశ్రయించగా తొలగింపుపై కోర్టు స్టే విధించింది. పట్టణాభివృద్ధి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌.సురేశ్‌కుమార్‌ మరోసారి సెప్టెంబరులో ఉత్తర్వులను జారీ చేశారు. ప్రస్తుతం పూర్తి స్థాయిలో మేయర్ పదవి ఖాళీ కావడంతో ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఒకవేళ ఎన్నికల అనుకున్న తేదీన జరగకపోతే మరుసటి రోజు కానీ, ఆ మరుసటి రోజు కూడా సాధ్యపడకపోతే ఎన్నికల సంఘం నిర్ణయం మేరకు కడప మేయర్ స్థానానికి ఎన్నిక జరుగుతుందని తెలుస్తోంది.

Next Story