Breaking: అన్నమయ్య జిల్లాలో భారీ వర్షం.. రోడ్లు జలమయం

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-11-29 14:20:34  IST  )

అన్నమయ్య జిల్లాలో భారీగా వర్షం కురుస్తోంది...

Breaking: అన్నమయ్య జిల్లాలో భారీ వర్షం.. రోడ్లు జలమయం
X

దిశ, వెబ్ డెస్క్: అన్నమయ్య జిల్లా(Annamaiah District) రైల్వే కోడూరు నియోజకవర్గంలో భారీగా వర్షం(Heavy Rains) కురుస్తోంది. తుపాను ప్రభావంతో ఎడతెరిపి లేకుండా వాన పడుతోంది. దీంతో రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల ఇళ్లలోకి సైతం వర్షపు నీరు చేరుతోంది. మరోవైపు వాగులు, వంకలకు భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో ప్రజలకు అప్రమత్తత ప్రకటించారు. వర్షాలు పడుతున్న సమయంలో అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని తెలిపారు. లోతట్టు ప్రజలు పునరావాసాలకు తరలివెళ్లాలని చెప్పారు. తుపాను నేపథ్యంలో ఆది, సోమవారం కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా వెంటనే స్థానిక అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.

Next Story