- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Kadapa: డీజిల్ ట్యాంకర్ బోల్తా .. డ్రైవర్ దుర్మరణం
వైఎస్ఆర్ కడప జిల్లా వల్లూరు తాడిపత్రి జాతీయ రహదారి తప్పెట్ల ఓవర్ బ్రిడ్జిపై డీజిల్ ట్యాంకర్ అదుపుతప్పి బోల్తా పడింది...

X
దిశ, డైనమిక్ బ్యూరో: వైఎస్ఆర్ కడప జిల్లా వల్లూరు తాడిపత్రి జాతీయ రహదారి తప్పెట్ల ఓవర్ బ్రిడ్జిపై డీజిల్ ట్యాంకర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ దుర్మరణం చెందగా క్లీనర్‌కు స్వల్పగాయాలయ్యాయి. కడప నుంచి ఎర్రగుంట్లకు వెళ్తున్న డీజిల్ ట్యాంకర్ టైరు పంక్చర్ కావడంతో అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో డ్రైవర్ బాబా ఫక్రుద్దీన్ (40) అక్కడికక్కడే మృతి చెందాడు. ఫక్రుద్దీన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కడప రిమ్స్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
Next Story






