Kadapaలో సైబర్ నేరస్తుడి అరెస్ట్.. దేశవ్యాప్తంగా 440 నేరాలు

by Disha Web Desk 16 |
Kadapaలో సైబర్ నేరస్తుడి అరెస్ట్.. దేశవ్యాప్తంగా 440 నేరాలు
X

దిశ, కడప: ఆధార్ ఎనేబుల్ పేమెంట్ సిస్టం ద్వారా 440 నేరాలు చేసిన ముగ్గురు కేటుగాళ్లలో ప్రధాన ముద్దాయి ఉత్తరప్రదేశ్‌కు చెందిన శేషనాథ్ విశ్వకర్మను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఇద్దరి కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఆధార్ నెంబర్లు, ఫింగర్ ప్రింట్లు ఉన్న హార్డ్ డిస్క్‌తో పాటు స్కానర్, రెండు మొబైల్స్, ఫింగర్ ప్రింట్ డివైస్, మోనిటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. శేషనాథ్‌పై దేశవ్యాప్తంగా 128, తెలంగాణలో 107 కేసులు ఉన్నట్లు గుర్తించారు. పలువురి అకౌంట్ల నుంచి దేశవ్యాప్తంగా కోటి రూపాయలపైగా కొట్టేసినట్లు పోలీసులు తెలిపారు.

కడప జిల్లాలో కొంతమంది తమ అకౌంటు నుంచి నగదు మాయమవుతుండడంతో ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు.కడప ఫకీర్‌పల్లి చెందిన సానపు రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు పేర్కొన్నారు. నిందితులు ఆధార్ ఎనేబుల్ పేమెంట్ సిస్టం ద్వారా వేలిముద్రలు నకిలీవి సృష్టించి వాటి సహాయంతో మోసం చేస్తున్నట్లు గుర్తించామని చెప్పారు. కస్టమర్ సర్వీస్ పాయింట్ బయోమెట్రిక్ డివైస్ స్కానర్స్‌లో స్కాన్ చేసి ఫిర్యాదు యొక్క ఆధార్ కార్డు లింక్ ఉన్న బ్యాంక్ అకౌంట్ నుంచి రోజుకు పదివేల రూపాయలు చొప్పున 89,550 రూపాయలు విత్ డ్రా చేసినట్లు స్పష్టం చేశారు. జనవరి 22న అరెస్టు చేసి ట్రాన్సిట్ వారెంట్‌పై కడప జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించినట్లు తెలిపారు.

Next Story

Most Viewed