- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CPI: బీజేపీతో చంద్రబాబు కలిస్తే లాభం ఆయనకే: Ramakrishna
రాష్ట్ర వ్యాప్తంగా సీపీఐ చేపట్టిన బస్సు యాత్ర కడప జిల్లాలో జరిగింది. ...

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా సీపీఐ చేపట్టిన బస్సు యాత్ర కడప జిల్లాలో జరిగింది. టీడీపీ, బీజేపీ పొత్తుపై ఈ సందర్భంగా ఆ పార్టీ నేత రామకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో చంద్రబాబు పొత్తు పెట్టుకుంటే జగన్ నెత్తిమీద పాలు పోసినట్టేనని ఆయన వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో టీడీపీ కలిస్తే వైసీపీకే లాభమని తెలిపారు.
కాగా ఏపీలో టీడీపీ, బీజేపీ పొత్తు పెట్టుకుంటాయని ప్రచారం జరుగుతోంది. టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ సీఎం నందమూరి తారక రామారావు పేరుతో కేంద్రప్రభుత్వం రూ. 100 నాణేన్ని విడుదల చేశారు. ఈ సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు పలువురు బీజేపీ పెద్దలను కలిశారు. దీంతో వచ్చే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పని చేస్తామని.. గతంలో మాదిరిగా మరోసారి పొత్తు పెట్టుకుంటాయని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సీపీఐ నేత రామకృష్ణ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.






