- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాధ్యతా రాహిత్యం వల్లే ఇంతకష్టం: Chandrababu
by Vemula.Srinu Prasad |
ప్రభుత్వ బాధ్యతా రాహిత్యంతోనే అప్పన్న భక్తులకు ఇబ్బందులు కలిగాయని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు...

X
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రభుత్వ బాధ్యతా రాహిత్యంతోనే అప్పన్న భక్తులకు ఇబ్బందులు కలిగాయని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో భక్తుల ఇబ్బందులు బాధ కలిగించాయని చెప్పారు. ప్రభుత్వం బాధ్యతా రాహిత్యంతోనే అప్పన్న భక్తులకు ఇంత కష్టం వచ్చిందన్నారు.
చందనోత్సవంలో భాగంగా సింహాచలం అప్పన్న నిజరూపదర్శనం కోసం భక్తులు భారీగా తరలివచ్చారని... అయితే స్వామి వారి దర్శనం లభించక భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని చంద్రబాబు చెప్పారు. దశాబ్దాలుగా లేని ఇబ్బందులు, రాని సమస్యలు పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఇప్పుడే ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించారు. దేవస్థానాలను వివాద కేంద్రాలుగా మార్చడం తప్ప.. జగన్ ఏం అభివృద్ధి చేశారని చంద్రబాబు నిలదీశారు.
Next Story






