Viveka Case: ఎంపీ అవినాశ్ రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు

by Vemula.Srinu Prasad |   (  Updated:2023-05-15 12:45:05  IST  )

కడప వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి సీబీఐ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు...

Viveka Case: ఎంపీ అవినాశ్ రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు
X

దిశ, వెబ్ డెస్క్: కడప వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి సీబీఐ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందారెడ్డి హత్య కేసులో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇప్పటికే పలుమార్లు విచారించిన అధికారులు.. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ కోఠి సీబీఐ కార్యాలయానికి రావాలని తెలిపారు.

కాగా తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ అవినాశ్ రెడ్డి చేసిన ప్రయత్నం ఫలించలేదు. కేసు విచారణలో ఉన్నందున బెయిల్ ఇవ్వడం కుదరని కోర్టు తేల్చి తెలిపింది. దీంతో ఆయన అరెస్ట్ తప్పదంటూ ప్రచారం జరిగుతుంది. సరిగ్గా ఇదే సమయంలో మరోసారి అవినాశ్ రెడ్డిని సీబీఐ అధికారులు విచారణకు పిలవడంతో ఆయన అనుచరుల్లో టెన్షన్ నెలకొంది.

Also Read..

Ycp Mla: ప్యాకేజీ స్టారే.. రా చెప్పుతో కొట్టు!

Next Story