ఐదుగురు ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్ట్

by Vemula.Srinu Prasad |

కడప జిల్లా రాజంపేట, నందలూరు పరిధిలో పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో భారీగా ఎర్రచందనం పట్టుబడింది...

ఐదుగురు ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: ఎర్రచందనం అక్రమంగా తరలింపుపై పోలీసుల నిషేదాజ్ఞలు ఉన్న కొందరు మాత్రం యదేచ్ఛగా దందా సాగిస్తున్నారు. టన్నుల కొద్ది దుంగలు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. కొన్ని సమయంలో దుంగల తరలింపును అడ్డుకుంటే అరాచకాలకు పాల్పడుతున్నారు. ప్రాణాలను సైతం తీస్తున్నారు. మరికొన్ని సమయాల్లో పోలీసులు జరిపిన తనిఖీల్లో దొరికిపోయి జైలుపాలవుతున్నారు. తాజాగా కడప జిల్లా రాజంపేట, నందలూరు పరిధిలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. 1.061 టన్నుల 36 ఎర్రచందనం దుంగలు తరలిస్తున్న వాహనాన్ని అడ్డుకున్నారు. ఐదుగురు దుండగలును అరెస్ట్ చేశారు. పట్టుకున్న సరుకును స్థానిక పోలీసులకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే చట్ట విరుద్ధమైన పనులు ఎవరూ చేయొద్దని తెలిపారు. ఎర్రచందనం తరలింపుపై తమకు సమాచారం, అట్టి వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని పోలీసులు పేర్కొన్నారు.

Next Story