మళ్లీ అదే బాణం.. వైసీపీ కీలక నిర్ణయం

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-09-11 14:25:25  IST  )

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరోసారి సైతం సోషల్ మీడియానే నమ్ముకుంటోంది....

మళ్లీ అదే బాణం.. వైసీపీ కీలక నిర్ణయం
X

దిశ, వెబ్ డెస్క్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSR Congress Party) మరోసారి సోషల్ మీడియానే నమ్ముకుంటోంది. గత ఐదేళ్లు అధికారంలో ఉన్న సమయంలో అప్పటి ప్రతిపక్షాల విమర్శలను సోషల్ మీడియా వేదికగా తిప్పికొట్టింది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియా ద్వారానే పోరాటం చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వైసీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్లు, సిబ్బందికి తెలియజేసింది. ఇక ఈ విషయాన్న వైసీపీ ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna Reddy) స్పష్టం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలు, వైసీపీ ప్రభుత్వం చేసిన మేలుపై సోషల్ మీడియా ద్వారా తమ వాణిని వినిపించాలని ఆ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలకు సజ్జల సూచించారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ(BC)ల అభివృద్ధికి జగన్ సమగ్ర విధానం తీసుకొచ్చారని గుర్తు చేశారు. బీసీలకు గుర్తింపు తెచ్చిందే వైసీపీ ప్రభుత్వమని చెప్పారు. ప్రజల్లో చైతన్యం కలిగించే బాధ్యత తమదేనన్నారు. సోషల్ మీడియాలో మన వాణిని బలంగా వినిపిద్దామని పిలుపు నిచ్చారు. జగన్ ప్రభుత్వం చేసిన మేలు ప్రజలు మరచిపోలేదని చెప్పారు. కూటమి ప్రభుత్వంపై ప్రజలు విసిగిపోయారుని, బీసీలు వైసీపీ వెంటే ఉన్నారని నిరూపిద్దామని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.

Next Story