వైసీపీకి మరో షాక్.. ఆ మున్సిపల్ చైర్మన్‌పై అవిశ్వాసం

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-04-28 14:17:54  IST  )

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరోసారి బిగ్ షాక్ తగిలింది...

వైసీపీకి మరో షాక్.. ఆ మున్సిపల్ చైర్మన్‌పై అవిశ్వాసం
X

దిశ, వెబ్ డెస్క్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(Ysrcp)కి వరుస దెబ్బలు తగులుతున్నాయి. వివిధ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు చేజారిపోయాయి. గత ఎన్నికల్లో బిగ్ విక్టరీ కొట్టి మెజార్టీ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో వైసీపీ(Ycp) జెండాను ఎగురవేసింది. ఆయా మేయర్, చైర్మన్ పీఠాలను దక్కించుకుంది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీన్ రివర్స్ అయిపోయింది. వరుసగా అవిశ్వాసం వేటు పడుతోంది. మేయర్, చైర్మన్ పదవులను అధికార పార్టీ ఖాతాల్లోకి వెళ్లిపోతున్నాయి. ఇప్పటికే విశాఖ(Visakha), తిరుపతి(Tirupati), గుంటూరు లాంటి కార్పొరేషన్లపై అవిశ్వాసం బాణంతో కూటమి ఖాతాలోకి తీసుకున్నారు. అలాగే పలు మున్సిపాలిటీలను కూడా సొంతం చేసుకున్నారు.

తాజాగా మరో మున్సిపాలిటీపై కన్నేశారు. చైర్మన్‌పై అవిశ్వాసం(Disbelief) ప్రయోగించారు. విజయగనరం జిల్లా బొబ్బిలి మున్సిపల్ చైర్మన్ సావు వెంకట మురళీకృష్ణారావు(Bobbili Municipal Chairman Savu Venkata Muralikrishna Rao)పై అవిశ్వాసం తీర్మానం పెట్టారు. వైసీపీ అసమ్మతి నేతల మద్దతుతో కూటమి బలం 20కి చేరింది. దీంతో అవిశ్వాసం తీర్మానం ఇప్పటికే నోటీస్ ఇచ్చింది. అవిశ్వాసం తీర్మానంపై మంగళవారం ఓటింగ్ నిర్వహించున్నారు. ఈ నేపథ్యంలో బొబ్బిలి మున్సిపల్ కార్యాలయానికి టీడీపీ, జనసేన, వైసీపీ కౌన్సిలర్లు రానున్నారు. వైసీపీ కంటే కూటమి బలం ఎక్కువగా ఉండటంతో బొబ్బిలి పీఠం కూటమి ఖాతాల్లోకి కచ్చితంగా చేరుతుందని టీడీపీ, జనసేన నేతలు దీమా వ్యక్తం చేస్తున్నారు.

Next Story