వైసీపీకి బిగ్ షాక్.. టీడీపీలో చేరిన ముగ్గురు ఎమ్మెల్సీలు

by Vemula.Srinu Prasad |

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది..

వైసీపీకి బిగ్ షాక్.. టీడీపీలో చేరిన ముగ్గురు ఎమ్మెల్సీలు
X

దిశ, వెబ్ డెస్క్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSR Congress Party)కి బిగ్ షాక్ తగిలింది. ముగ్గురు ఎమ్మెల్సీలు ఆ పార్టీని వీడి తెలుగుదేశం(Telugu Country) తీర్థం పుచ్చుకున్నారు. గతంలోనే వైసీపీ(Ycp)కి రాజీనామా చేశారు. ఇప్పటికీ ఆమోదించకపోవడంతో సైకిల్ ఎక్కారు. సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) సమక్షంలో ఎమ్మెల్సీలు కళ్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, మర్రి రాజశేఖర్‌ టీడీపీ(Tdp)లో చేరారు. ముగ్గురు ఎమ్మెల్సీలకు పార్టీ కండువా కప్పి తెలుగుదేశం పార్టీలోకి వారిని సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీలు మాట్లాడుతూ తమ రాజీనామాలు ఇప్పటివరకు ఆమోదించలేదని తెలిపారు. రాజీనామాల ఆమోదం కోసం ఆరు నెలలుగా వేచి చూశామని చెప్పారు. రాజీనామా ఆమోదిస్తారన్న నమ్మకం లేదని తెలిపారు. మండలి చైర్మన్‌ వెనుక ఉండి నడిపించేవారి వల్ల రాజీనామాలు ఆమోదించలేదని ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్‌ పేర్కొన్నారు.

Next Story