- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈసారైనా విజిటర్స్ పాస్ లేకుండా అసెంబ్లీలోకి వెళ్లండి: పవన్‌పై పోతిన మహేశ్ సెటైర్స్
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వైసీపీ నేత పోతిన వెంకట మహేశ్ మరోసారి విమర్శలు చేశారు...

దిశ, వెబ్ డెస్క్: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వైసీపీ నేత పోతిన వెంకట మహేశ్ మరోసారి విమర్శలు చేశారు. ప్రతీసారి మీడియాలో పవన్ కల్యాణ్‌పై విరుచుకుపడే ఆయన ఈసారి సోషల్ మీడియా వేదికగా టార్గెట్ చేశారు. జనసేనను వీడుతున్న నేతలను ఉద్దేశించి పవన్ కల్యాణ్‌పై తాజాగా విమర్శలు కురిపించారు. తనపై జనసేన చంచాలు అరిసే బదులు పార్టీ వీడుతున్న వారిని కాపాడుకోవాలని ఎద్దేవా చేశారు. ఈసారైనా విజిటర్స్ పాస్ లేకుండా అసెంబ్లీలోకి వెళ్లే పని చూడాలని పోతిన మహేశ్ హితవు పలికారు.
కాగా జనసేన పార్టీలో పని చేసిన పోతిన మహేశ్ విజయవాడ వెస్ట్ నుంచి పోటీ చేయాలని భావించారు. అయితే కూటమిలో భాగంగా ఆయనకు జనసేన టికెట్ దక్కలేదు. దీంతో మనస్థాపం చెందని పోతిన మహేశ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. నాటి నుంచి పవన్ కల్యాణ్‌పై ప్రతి రోజు విమర్శలు చేస్తున్నారు. దీంతో ఆయనపై జనసేన నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో పోతిన మహేశ్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్పందించిన ఆయన సోషల్ మీడియాలో పవన్ కల్యాణ్‌పై విమర్శిస్తూ ట్వీట్ చేశారు.
నా మీదికి మీ చంచాలని అరవమనే బదులు మీ పార్టీ వదిలిపోతున్న నాయకుల్ని కాపాడుకోండి. ఈ సారైనా visitors pass లేకుండా అసెంబ్లీలోకి వెళ్లే పని చూడండి @PawanKalyan గారు.#MemanthaSiddham#YSJaganAgain#TDPJSPBJPCollapse#PackageStarPK
— Pothina venkata mahesh (@pvmaheshbza) April 21, 2024






