YS Viveka Case : ఉదయ్ కుమార్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలు

by Sathputhe Rajesh |

వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ సంచలన విషయాలను వెల్లడించింది.

YS Viveka Case : ఉదయ్ కుమార్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలు
X

దిశ, వెబ్‌డెస్క్: వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ సంచలన విషయాలను వెల్లడించింది. వైఎస్ వివేకా హత్యకేసులో సీబీఐ నిన్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ప్రధాన అనుచరుడు ఉదయ్ రెడ్డిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఉదయ్ కుమార్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్ లో కీలక విషయాలు వెలుగుచూశాయి. వివేకా హత్య గురించి ఉదయ్ కుమార్ రెడ్డికి ముందే తెలుసు అని సీబీఐ పేర్కొంది. హత్య జరిగిన రోజు అవినాష్ రెడ్డి ఇంట్లోనే ఉదయ్ ఉన్నాడని సీబీఐ తెలిపింది. గూగుల్ టేక్ అవుట్ లోనూ లొకేషన్ కి సంబంధించిన ఆధారాలు ఉన్నాయని తెలిపింది. వివేకా చనిపోయారని మూడో వ్యక్తి ద్వారా తెలిశాకే బయటకు వచ్చినట్లు తెలిపింది. పారిపోతాడనే అనుమానంతో ఉదయ్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేశామని తెలిపింది.

Next Story