YS Sunitha: సీఎం జగన్ బ్యాండేజీపై వైఎస్ సునీతా సెన్సేషనల్ కామెంట్స్.. సెప్టిక్ అవుతుది అంటూ సెటైర్లు

by Kema Shiva Kumar |

సీఎం జగన్‌పై ప్రతిపక్ష నాయకుల విమర్శలేమో గాని సొంత చెల్లెళ్లు చేస్తున్న ఆరోపణలు ఆయన ఇమేజ్‌ను దెబ్బతీస్తున్నాయి.

YS Sunitha: సీఎం జగన్ బ్యాండేజీపై వైఎస్ సునీతా సెన్సేషనల్ కామెంట్స్.. సెప్టిక్ అవుతుది అంటూ సెటైర్లు
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం జగన్‌పై ప్రతిపక్ష నాయకుల విమర్శలేమో గాని సొంత చెల్లెళ్లు చేస్తున్న ఆరోపణలు ఆయన ఇమేజ్‌ను దెబ్బతీస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇవాళ వైస్ సునీతా జగన్‌పై సంచలన వ్యాఖ్యల చేశారు. ఎక్కువ రోజుల పాటు తలకు బ్యాండేజీ ఉంటే సెప్టిక్ అవుతుందని సెటైర్లు వేశారు. జగన్‌కు వైద్యులు సరైన సలహా ఇవ్వలేదేమో.. జగన్‌ త్వరగా బ్యాండేజ్‌ తీసేయాలంటూ ఓ వైద్యురాలిగా సలహా ఇస్తున్నానంటూ చురకలంటించారు. నామినేషన్ కార్యక్రమం సందర్భంగా జగన్ చేసిన వ్యాఖ్యలపై ఆమె బదులిచ్చారు. తన తండ్రి వివేకానంద రెడ్డిపై సీఎం‌కు ద్వేషం ఉందన్నారు. హత్యపై మాట్లాడొద్దని చెప్పి కోర్టుకు వెళ్లిన వారి అదే హత్యపై మళ్లీ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఐదేళ్లుగా తన తండ్రి హత్యపై పోరాడుతుంటే నన్ను కూడా రాజకీయాల్లోకి లాగుతున్నారని సునీత ఆరోపించారు.

Next Story