సీఎం చంద్రబాబును కలిసిన వైఎస్‌ సునీత

by Ajay Maddhiboyina |   (  Updated:2025-07-23 15:36:56  IST  )

వైఎస్ సునీత మరోసారి ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. తన తండ్రి వివేక హత్య కేసులో నిందితులకు శిక్ష పేడేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

సీఎం చంద్రబాబును కలిసిన వైఎస్‌ సునీత
X

దిశ‌, వెబ్ డెస్క్: వైఎస్ సునీత మరోసారి ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. తన తండ్రి వివేక హత్య కేసులో నిందితులకు శిక్ష పేడేలా చర్యలు తీసుకోవాలని కోరారు. గతేడాది సెప్టెంబర్‌లో కూడా సునీత తన భర్త రాజశేఖర్ రెడ్డితో కలిసి చంద్రబాబుతో భేటీ అయ్యారు. సచివాలయంలో చంద్రబాబుతో పది నిమిషాల పాటు సునీత దంపతులు వివేక హత్య గురించి చర్చించారు. అప్పుడు చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. హత్యపై విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు. ఇక తాజాగా మరోసారి సీఎంను సునీత దంపతులు కలవడం హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ జరుగున్న సంగతి తెలిసిందే.

ఈనెల 21న సుప్రీంకోర్టు వివేకా హత్యకేసుపై దాఖలు చేసిన పిటిషన్లపై విచారించింది. సునీత తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. అవినాశ్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని ఆయన బయట ఉంటే దర్యాప్తును ప్రభావితం చేస్తారని వాదించారు. దీంతో సుప్రీం మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ ప్రశ్నించింది. కేసులో తదుపరి దర్యాప్తు అవసరమని సీబీఐ భావిస్తుందా అని ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వం కడప సెషన్స్ కోర్టులో దాఖలు చేసిన క్లోజర్ రిపోర్టుపై సీబీఐ అభియమేంటిి అని ప్రశ్నించింది. తదుపరి దర్యాప్తు ఏకకాలంలో కొనసాగించే అవకాశం ఉందా లేదా అని అడిగింది. తదుపరి విచారణను ఆగస్టు 5వ తేదీకి వాయిదా వేసింది.

Next Story