- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ఆ భూముల జోలికొస్తే ఊరుకోం’.. వైఎస్ షర్మిల స్ట్రాంగ్ వార్నింగ్
ఏపీలోని కూటమి ప్రభుత్వం పై ఏపీ పీసీసీ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. కరేడు రైతులది బతుకు పోరాటం.

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలోని కూటమి ప్రభుత్వం పై ఏపీ పీసీసీ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. కరేడు రైతులది బతుకు పోరాటం. ఊరిని చంపి పరిశ్రమ పెడతాం అంటే చూస్తూ ఊరుకునేది లేదని వైఎస్ షర్మిల తేల్చి చెప్పారు. కరేడు భూములు జోలికొస్తే రైతుల పక్షాన ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సోలార్ ప్లాంట్‌కి వ్యతిరేకంగా నెల్లూరు జిల్లా కరేడు గ్రామ రైతులు చేస్తున్న ఉద్యమానికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుంది. పచ్చటి పొలాల్లో ప్రజా అభిప్రాయం సేకరించకుండా భూ సేకరణకు నోటిఫికేషన్ ఇవ్వడం దుర్మార్గం. ఇది కూటమి ప్రభుత్వ నియంత పోకడకు నిదర్శనం అన్నారు. ప్రజల నిర్ణయానికి వ్యతిరేకంగా ఇండోసోల్ సోలార్ కంపెనీకి 8458 ఎకరాలు దారాదత్తం చేస్తామనడం పై వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.
గత YCP ప్రభుత్వం శిరిడీ సాయి అనుబంధ కంపెనీకి అనుమతులు ఇస్తే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం భూ సేకరణకు కనీసం గ్రామ సభలు పెట్టలేదు. మూడు పంటలు పండే పచ్చటి పొలాల్లో పరిశ్రమ వద్దనే రైతుల గోడు వినలేదు. ఇండోసోల్ కంపెనీకి అదనంగా భూములు కేటాయించి, ఊరినే ఖాళీ చేయించాలని చూస్తున్నారు. శాంతియుత ఉద్యమం చేసే కరేడు గ్రామ ప్రజలను నిర్బంధించడాన్ని, అరెస్టులను తీవ్రంగా ఖండించారు. వెంటనే భూసేకరణకు ఇచ్చిన నోటిఫికేషన్ ను రద్దు చేయండి. సోలార్ ప్లాంట్ ఏర్పాటుపై కరేడు గ్రామ ప్రజల అభిప్రాయాన్ని తీసుకోండి. గ్రామ సభలు నిర్వహించండి. రైతుల డిమాండ్లపై సానుకూలంగా స్పందించండి. పరిశ్రమల ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదు.. అలా అని రైతుల శవాల మీద అక్రమంగా భూసేకరణ చేయాలని చూస్తే మాత్రం సహించేది లేదని వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు.ట్వీట్






