- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలు చేపట్టిందట’.. మోడీపై షర్మిల సెటైర్
కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi)పై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi)పై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ‘‘జీఎస్టీతోతో దోచింది కొండంత.. తగ్గింపు గోరంత. ఎనిమిది ఏళ్లలో మోడీ మోపిన గబ్బర్ సింగ్ ట్యాక్స్ భారం అక్షరాల రూ.55.44 లక్షల కోట్లు.. 2.O సంస్కరణల ముసుగులో తగ్గింపు విలువ కేవలం రూ.2.5లక్షల కోట్లు. GST పేరుతో చేసిన లోతైన గాయానికి అయింట్మెంట్ రాయాలని చూసే బీజేపీ బ్యాండ్ - ఎయిడ్ రాజకీయాలను దేశ ప్రజలు ఎన్నటికీ క్షమించరు. GSTపై మోడీవి జిత్తులమారి వేషాలు. ఇన్నాళ్లు పన్నుల మోత మోగించి, సామాన్యులను గుల్ల చేసి, ఇప్పుడేదో నవశకం ఆరంభమని, నవతరమని, ఆత్మనిర్భరత లాంటి శుద్ధపూస మాటలు మోడీ మాట్లాడుతుంటే.. వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలు చేపట్టిన సామెత నిజంగా గుర్తుకొస్తుంది. GST తాజా సంస్కరణలు బీజేపీ చేసిన ఆర్థిక గాయాలను కప్పిపుచ్చుకొనే ప్రయత్నం కోసమే’’ అని నెట్టింట షర్మిల పేర్కొన్నారు. షర్మిల ట్వీట్






