- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీ ఎంపీలకు చీము, నెత్తురు లేదా?: వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
కూటమి ఎంపీలపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: కూటమి ఎంపీలపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘పార్లమెంట్ సమావేశాల్లో విభజన సమస్యల మీద నోరు విప్పే దమ్ము రాష్ట్రంలోని 25 మంది లోక్‌సభ ఎంపీలు, 11 మంది రాజ్యసభ ఎంపీలకు లేదు. రాష్ట్రంలో ఉన్న ఎంపీలు అందరూ బీజేపీ ఎంపీలే. 11 ఏళ్లుగా విభజన సమస్యలు పెండింగ్‌లోనే ఉన్నాయి. అందరూ ప్రధాని మోడీ మెప్పు కోసమే పని చేస్తున్నారు. ప్రత్యేక హోదా రాష్ట్ర విభజన హామీ. మోడీ 10 ఏళ్లు హోదా ఇస్తాం అన్నారు. చంద్రబాబు 15 ఏళ్లు కావాలని అడిగి హోదా ఏమైనా సంజీవనినా అన్నారు. ప్రత్యేక ప్యాకేజీ రూ.70 వేల కోట్లతో వస్తుంది అన్నారు. హోదా లేదు చివరికి ప్యాకేజీ లేదు.
హోదా వచ్చి ఉంటే రాష్ట్ర అభివృద్ధి ఇంకోలా ఉండేది. రాష్ట్ర ఎంపీలకు చీము నెత్తురు ఉంటే.. దమ్ము ధైర్యం ఉంటే.. హోదా మీద తాడో పేడో తేల్చాలి. పోలవరం జాతీయ ప్రాజెక్ట్. 11 ఏళ్లుగా పోలవరాన్ని కట్టకుండా ప్రాజెక్ట్‌లో జీవం తీసేశారు. రూ.25 వేల కోట్లు మిగిలించేందుకు పోలవరం ఎత్తు తగ్గించారు. పోలవరంకి అన్యాయం జరుగుతుంటే ఒక్క ఎంపీ కూడా నోరు విప్పడం లేదు. విభజన చట్టంలో కేంద్రమే రాజధాని నిర్మించాలి. చివరికి నిధులు బదులు అప్పులు ఇస్తున్నారు. రూ.15 వేల కోట్లు అప్పులు ఇచ్చి బీజేపీ ఉద్ధరించినట్లు గొప్పలు చెప్తుంది. రాష్ట్ర ఎంపీలు రాజధానిపై పార్లమెంట్‌లో నిలదీయాలి.
కడప స్టీల్, దుగరాజపట్నం పోర్ట్ కలగానే మిగిలింది. ఇండస్ట్రియల్ కారిడార్ అమలు కాలేదు. వెనుకబడిన ప్రాంతాలకు రూ. 25 వేల కోట్ల ఆర్థిక ప్యాకేజీ రావాలి.. రాష్ట్ర ఎంపీలకు కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రజల పక్షాన నిలబడండి. సభను స్తంభింపజేయండి. విభజన హక్కుల మీద కొట్లాడండి’ అని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ట్వీట్






