- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చంద్రబాబు ఆశ చావలేదు: షర్మిల సెటైర్
ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ట్వీట్ పెట్టారు. ‘‘నిన్న బనకచర్ల, నేడు నల్లమల సాగర్.. పోలవరం లింక్ ప్రాజెక్టుకు అనుమతులు రాకున్నా.. చంద్రబాబు ఆశమాత్రం చావలేదు. అనుసంధానంపై ఉన్న శ్రద్ధ.. పోలవరం పూర్తి చేయడంపై లేదు. పనికి రాని ప్రాజెక్ట్‌కు డీపీఆర్‌ల మీద, నిధుల సమీకరణ మీద పెట్టే దృష్టి.. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడంపై పెట్టడం లేదు. పోలవరంతో పాటు 56 ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉంటే వాటిని గాలికొదిలేసి లింక్ ప్రాజెక్ట్ అని పట్టుకు తిరుగుతున్నారు. జలయజ్ఞానికి నిధులు లేవు కానీ.. రూ.58 వేల కోట్లతో పోలవరం - నల్లమల సాగర్ లింక్ కడతారట. ఇది భారీ అవినీతికి స్కెచ్ కాకపోతే మరేంటి? లింక్ ప్రాజెక్ట్‌తో ఉపయోగం లేదని నిపుణులు మొత్తుకుంటున్నా.. డీపీఆర్ పేరిట హడావిడి ఎందుకు? పోలవరం,పెండింగ్ జలయజ్ఞం ప్రాజెక్టులపై కూటమి ప్రభుత్వానికున్నది సవతి తల్లి ప్రేమ. ఎత్తు తగ్గించి కేంద్రం అన్యాయం చేసినా నోరు మెదపనిది ఇందుకే.
పోలవరం ఎత్తు 45.72 మీటర్ల నుంచి 41.15కు కుదించి జీవనాడిలో జీవం తీశారు. రూ.25వేల కోట్ల ఆర్ అండ్ ఆర్ మిగులు కోసం ప్రాజెక్టుని డ్యామ్‌గా మార్చారు. 7 లక్షల ఎకరాలకు, 25 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు, 30 లక్షల మందికి తాగునీరు అందించే పోలవరం ప్రాజెక్టు స్వరూపాన్ని మార్చి ప్రశ్నార్థకం చేశారు. బ్యారేజ్‌గా తప్ప బహుళార్థక సాధకంగా పనికి రాకుండా చేశారు. సర్వం కోల్పోయిన నిర్వాసితులకు పరిహారం అందక తీరని ద్రోహం చేశారు. జాతీయ హోదా ప్రాజెక్టుకి కేంద్రం ఇంత అన్యాయం చేస్తుంటే, మిగులు బడ్జెట్ కోసం రాష్ట్ర ప్రయోజనాలకు సమాధి కడుతుంటే కూటమిలో పెద్దన్న పాత్ర పోషించే చంద్రబాబు నోరుమెదపకుండా లింక్ పేరుతో హంగామా చేయడం దుర్మార్గం. బాబుకి ఏటీఎమ్‌గా పనికొచ్చేందుకే ఈ కొత్త ప్రాజెక్టు.
రాష్ట్రంలో జలయజ్ఞం పెండింగ్ ప్రాజెక్ట్‌ల సంఖ్య 56. ఇవ్వాల్టి అంచనాల ప్రకారం పూర్తి చేయాలంటే కావాల్సిన నిధులు రూ. 60 వేల కోట్లు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేస్తే అందుబాటులోకి వచ్చే సాగునీటి లభ్యత 581 టీఎంసీలు. సాగుబడి జరిగే అదనపు విస్తీర్ణం అక్షరాల 54 లక్షల ఎకరాలు. గోదావరి లింక్ ప్రాజెక్టుకు పెట్టే 80 వేల కోట్ల నిధులతో జలయజ్ఞం పూర్తి చేస్తే అదనంగా 30 లక్షల ఎకరాలకు ప్రయోజనం. ఇంత తెలిసి చంద్రబాబు పెండింగ్ ప్రాజెక్ట్‌లపై కన్నెత్తి చూడటం లేదంటే.. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఎంతుందో అర్థమవుతుంది’’ అని షర్మిల పేర్కొన్నారు.






