మరోసారి వాటి మీద చేయి వేస్తే ఊరుకోను.. వైఎస్ షర్మిల హెచ్చరిక

by Gantepaka Srikanth |

రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) తీవ్ర వ్యాఖ్యలు చేశఆరు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు.

మరోసారి వాటి మీద చేయి వేస్తే ఊరుకోను.. వైఎస్ షర్మిల హెచ్చరిక
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) తీవ్ర వ్యాఖ్యలు చేశఆరు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ‘వైసీపీ మీదున్న కోపాన్ని వైఎస్ఆర్ విగ్రహాల మీద చూపించడం కరెక్ట్ కాదు. వైసీపీకి వైఎస్‌ఆర్‌కు ఎలాంటి సంబంధం లేదు. ఆ మహానేత పేరు పెట్టుకున్నంత మాత్రాన.. వైఎస్ఆర్ వారి సొత్తు కాదు. YSR అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. చివరి క్షణం దాకా తన జీవితాన్ని ప్రజల కోసమే త్యాగం చేసిన ప్రజా నాయకుడు. తెలుగు ప్రజల గుండెల్లో ఆయనది చెరగని ముద్ర. సంక్షేమ పథకాల అమలులో ఈ దేశానికి దిశా - నిర్దేశం చేసిన వ్యక్తి. ప్రజాక్షేమమే పరమావధిగా చివరి దాకా పరితపించిన గొప్ప వ్యక్తి. ఇంతటి ప్రజాభిమానం కలిగిన నాయకుడికి నీచ రాజకీయాలు చేసే వారితో కలిపి ఆపాదిస్తారా? ఆయన విగ్రహాల మీద కక్ష రాజకీయాలు చేస్తారా? ఇదెక్కడి దిక్కుమాలిన చర్య?’ అని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.

అంతేకాదు.. ‘నందిగామ గాంధీ సెంటర్‌లో మహానేత YSR విగ్రహాన్ని తొలగించడం దుర్మార్గం. ఈ చర్యను కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తోంది. ఇది కూటమి ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనం. ఉమ్మడి రాష్ట్రంలో మహానేత మరణం తర్వాత గాంధీ సెంటర్ వద్ద నాటి ప్రభుత్వం అక్కడ YSR విగ్రహాన్ని ఏర్పాటు చేసింది.YSR విగ్రహం చుట్టూ YCP అక్రమంగా వేసుకున్న సెట్టింగులు తొలగించుకోండి. మాకేం అభ్యంతరం లేదు. కానీ ఇదే సాకుగా చూపి YSR విగ్రహాల మీద చేయి వేస్తే చూస్తూ ఊరుకునేది లేదు. కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. YCPకి YSR విగ్రహాలకు సంబంధం లేదు. తొలగించిన చోట వెంటనే రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని తిరిగి ఏర్పాటు చేయండి. లేకుంటే ఉద్యమం తప్పదని తీవ్రంగా హెచ్చరిస్తున్నాం’ అని షర్మిల డిమాండ్ చేశారు.

Next Story