- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ముఖ్యమంత్రివా?.. కీలుబొమ్మవా..?: చంద్రబాబుపై రెచ్చిపోయిన షర్మిల
బీజేపీ చేస్తున్న నల్ల చట్టాలకు సీఎం చంద్రబాబు చప్పట్లు కొట్టడం అత్యంత సిగ్గుచేటని షర్మిల మండిపడ్డారు.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు(Chandrababu)పై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా షర్మిల పోస్టు పెట్టారు. ‘‘ కరువు పనిపై కేంద్రం కుట్రలు చేస్తుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు కిమ్మనకుండా ఉండటం దారుణం. బీజేపీ చేస్తున్న నల్ల చట్టాలకు చప్పట్లు కొట్టడం అత్యంత సిగ్గుచేటు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంత అభివృద్ధికి ఊతం ఇచ్చిందే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం. YSR ముఖ్యమంత్రిగా అనాడు దేశంలోనే తొలి ఉపాధి జాబ్ కార్డ్ అందింది రాష్ట్రంలోనే. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన పనికి ఆహార పథకంతో రాష్ట్రంలో ఏటా 80 లక్షల మంది పేదలకు ఉపాధి హక్కుగా మారింది.
రాష్ట్రంలో ఉపాధికి ఉరి..
దేశంలోనే ఉపాధి హామీ పథకాన్ని వాడుకుంటున్న రాష్ట్రాల్లో ఏపీ అగ్రస్థానంలో ఉందని తెలిసి, జీ రామ్ జీ పేరుతో తెచ్చిన అక్రమ చట్టంతో రాష్ట్రానికి ఏటా 4500 కోట్ల భారం అని తెలిసి, ఆర్థికంగా నిధులు సమకూర్చడం కష్టమని తెలిసి, గోరుచుట్టుపై రోకలి పోటులా కొత్త చట్టం మారిందని తెలిసి, ప్రశ్నించకుండా బాబు మౌనం వహించడం బాధాకరం. ప్రతి నెలా జీతాలు ఇవ్వడానికే అప్పులు చేసే మీరు.. జీ రామ్ జీ పథకానికి ఏటా 40 శాతం నిధులు ఎక్కడ నుంచి తెస్తారు? నిరుద్యోగంలో నెంబర్-1గా ఉన్న రాష్ట్రంలో ఉపాధికి ఉరి పెడుతుంటే ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? కొత్త చట్టాలతో పనికి పాతరేస్తుంటే అడ్డుకొనే బాధ్యత మీకు లేదా? మీరు రాష్ట్రానికి ముఖ్యమంత్రినా లేక మోడీ చేతిలో తోలుబొమ్మనా?’’ అని షర్మిల ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పక్షాన కూటమి పార్టీలను డిమాండ్ చేస్తున్నాం. నరేగా చట్టాన్ని తిరిగి పునరుద్ధరించేలా భేషరతుగా మద్దతు పలకండి.. ఉపాధి హామీ పథకానికి ఊపిరి తీసిన జీ రామ్ జీ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ షర్మిల డిమాండ్ చేశారు. మోడీ రామ్ జీ చట్టం రాష్ట్రానికే ప్రమాదం. వెంటనే కేంద్రంపై ఒత్తిడి తీసుకురండి. లేనిపక్షంలో కాంగ్రెస్ పార్టీ తరుపున కూటమి పార్టీల నిర్లక్ష్యాన్ని ఎండగడతామని వైఎస్ షర్మిల హెచ్చరించారు.






