- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘జగన్ గారు ఉద్ధరించింది శూన్యం’.. వైఎస్ వర్ధంతి వేళ జగన్‌పై షర్మిల ఘాటు వ్యాఖ్యలు
వైసీపీ(YCP) అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్(Jagan)పై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: వైసీపీ(YCP) అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్(Jagan)పై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా వైఎస్ షర్మిల(YS Sharmila) ట్వీట్ పెట్టారు. ‘"అన్నమయ్య..ఇక అంతేనయ్య". ప్రాజెక్ట్ కొట్టుకు పోయి ఐదేళ్లు దాటినా పునర్: నిర్మాణానికి దిక్కులేదు. 39 మందిని బలిగొన్న ఘోర విపత్తులో జరిగిన నష్టాన్ని పూడ్చే మనసు ప్రభుత్వాలకు లేదు. 5 ఊళ్లు కొట్టుకుపోతే పునరావాసానికి రూపాయి ఇచ్చింది లేదు. సర్వం కోల్పోయిన నిరాశ్రయులను నేటికీ ఆదుకున్నది లేదు. గత వైసీపీ, నేడు కూటమి ప్రభుత్వాలు కలిసి అన్నమయ్య ప్రాజెక్ట్‌ను "అనాథ ప్రాజెక్ట్" కింద మార్చారు.
గత ముఖ్యమంత్రి జగన్ రూ.800 కోట్లతో మరమత్తులు అంటూ హడావిడి తప్పా ప్రాజెక్ట్‌ను కట్టింది లేదు. పునరుద్ధరణ పేరుతో మూడేళ్లు గడిపారే తప్పా.. తట్టెడు మట్టి వేయలేదు. బాధిత కుటుంబాలకు ఇండ్లు అందలేదు. చనిపోయిన కుటుంబాలకు ఉద్యోగాలు దక్కలేదు. ఇసుక మాఫియాతో ప్రాజెక్టుకు గండి పడితే అసెంబ్లీ వేదికగా హై లెవెల్ కమిటీలనీ, దర్యాప్తు కొనసాగిస్తామని కాలయాపన తప్పా జగన్ గారు ఉద్ధరించింది శూన్యం.
అధికారంలో వచ్చిన ఏడాదిలో ప్రాజెక్ట్ కడతామని చెప్పి చంద్రబాబు(Chandrababu) చేస్తుంది మోసమే. రాజంపేటకు రెండుసార్లు వచ్చి పోయినా ప్రాజెక్ట్ పనులకు మోక్షం లేదు. 340 కోట్లతో మరమత్తులు అని చెప్పి రూపాయి కూడా ఇవ్వలేదు. డ్యామ్ నిర్మాణం కోసం సర్వేల పేరుతో చంద్రబాబు సైతం కాలయాపన చేస్తున్నారు. రాజంపేట వేదికగా మళ్లీ మాయమాటలు చెప్పారు తప్పిస్తే ప్రాజెక్ట్ నిర్మాణంపై దిశా - నిర్దేశం లేకపోవడం శోచనీయం.
కాంగ్రెస్ పార్టీ పక్షాన కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అన్నమయ్య కన్నీటి వ్యధకు శాశ్వత పరిష్కారం చూపాలి. గత ఐదేళ్లుగా నీటి నిల్వ లేక 30 వేల ఎకరాలకు సాగునీరు పారడం లేదు. లక్షమందికి తాగునీరు అందడం లేదు. వెంటనే పూర్తి స్థాయి నిధులు కేటాయించి అన్నమయ్య ప్రాజెక్టును పూర్తి చేయాలని, డ్యామ్ ప్రమాదంలో సర్వం కోల్పోయిన కుటుంబాలకు హామీల మేరకు పూర్తి స్థాయి జరగాలని డిమాండ్ చేస్తున్నాం’ అని సోషల్ మీడియా వేదికగా షర్మిల డిమాండ్ చేశారు.






