ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు: షర్మిల ట్వీట్ వైరల్

by Gantepaka Srikanth |   (  Updated:2026-01-05 12:29:37  IST  )

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఓఎన్జీసీ డ్రిల్‌ సైట్‌ నుంచి గ్యాస్‌ లీకైన ఘటనపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు.

ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు: షర్మిల ట్వీట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: అంబేద్కర్ కోనసీమ జిల్లా(Ambedkar Konaseema District)లో ఓఎన్జీసీ డ్రిల్‌ సైట్‌ నుంచి గ్యాస్‌ లీకైన ఘటనపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ‘‘రాజోలు నియోజ‌క‌వ‌ర్గం మలికిపురంలో ONGC డ్రిల్ సైట్ నుంచి గ్యాస్ లీకేజీ ఘటన తీవ్ర భయాందోళనకు గురిచేసింది. మంటలు ఎగసి పడుతున్న దృష్ట్యా ఎటువంటి నష్టం జరగకుండా ప్రభుత్వం సహాయక చర్యలు ముమ్మరం చేయాలి. వెంటనే మంటలకు అదుపులోకి తీసుకొచ్చేలా చర్యలు చేపట్టాలి. ఈ ఘటన మరో బ్లో అవుట్‌కి దారి తీస్తుందని ఆ ప్రాంత ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. తక్షణం చుట్టుపక్కల గ్రామస్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. కోనసీమ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేస్తున్నాం. మంటలు అదుపులోకి తీసుకొచ్చే వరకు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే కార్యక్రమంలో భాగస్వామ్యం అవ్వండి. మనవంతు సహాయక కార్యక్రమాలు నిర్వహించండి.

కూటమి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. కోనసీమ ప్రాంతంలో ఈ మధ్య వరుస గ్యాస్ లీకేజీ ఘటనలపై విచారణ జరిపించండి. భయం గుప్పిట్లో బతుకుతున్న గ్యాస్ పైప్ లైన్ పరివాహక ప్రాంతాల ప్రజల ఆవేదనను అర్థం చేసుకోండి. ఇటువంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చూడండి’’ అని ట్వీట్‌లో షర్మిల డిమాండ్ చేశారు.

Next Story