ఆ విషయం దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోండి: చంద్రబాబుకు షర్మిల లేఖ

by Gantepaka Srikanth |

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల లేఖ రాశారు.

ఆ విషయం దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోండి: చంద్రబాబుకు షర్మిల లేఖ
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల లేఖ రాశారు. లేఖలో డీలిమిటేషన్‌పై కీలకంగా ప్రస్తావించారు. ‘‘కేంద్రం ప్రతిపాదించిన 2011 జనాభా లెక్కల ఆధారిత డీలిమిటేషన్ ప్రక్రియ రాష్ట్ర ప్రయోజనాలను దారుణంగా దెబ్బతీస్తోంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయ, ఆర్థిక భవిష్యత్తుకు పెను ముప్పు. అత్యంత ఆందోళనతో, ఒక అత్యవసర పరిస్థితిగా గుర్తిస్తూ, నియోజకవర్గాల పునర్విభజనపై ఈ 3 పేజీల బహిరంగ లేఖను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పక్షాన రాస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ తన స్వరం మాత్రమే కాదు, వేల కోట్ల రూపాయల భవిష్యత్ ఆర్థిక అవకాశాలను కూడా కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో, నేను మిమ్మల్ని గట్టిగా, స్పష్టంగా కోరుతున్నాను. దక్షిణ రాష్ట్రాలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కు తీవ్రంగా అన్యాయం చేసే ఈ ప్రతిపాదిత డీలిమిటేషన్‌కు మీరు బహిరంగంగా, స్పష్టంగా వ్యతిరేకత తెలియజేయాలి.

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 25 లోక్‌సభ సభ్యులు, 11 రాజ్యసభ సభ్యులు అందరినీ, పార్టీ భేదాలు లేకుండా ఏకతాటిపైకి తీసుకువచ్చి, పార్లమెంటులో ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసేలా ప్రోత్సహించాలి. అత్యవసరంగా ఒకరోజు ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాన్ని ఏర్పాటు చేసి, ఈ కీలక అంశంపై చర్చించి, ప్రతిపాదిత డీలిమిటేషన్ ఫ్రేమ్‌వర్క్‌ను తిరస్కరించే తీర్మానం ఆమోదించి, కేంద్ర ప్రభుత్వానికి అధికారికంగా పంపించాలి. ఇది రాజకీయ నిర్ణయం మాత్రమే కారాదు. ఇది ప్రజల హక్కులను కాపాడే రాజ్యాంగ బాధ్యతగా, భావితరాల భవితను గుర్తుపెట్టుకుని వేసే అడుగు’’ అని షర్మిల లేఖలో పేర్కొన్నారు.

Next Story