- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీజేపీని ఢీ కొట్టే దమ్ము ఆ పార్టీకే ఉంది.. YS షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు
రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం(NDA Govt)పై కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం(NDA Govt)పై కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ‘కాంగ్రెస్ పార్టీ జిల్లాల విస్తృత స్థాయి సమావేశాల్లో భాగంగా నేడు తిరుపతి జిల్లా నేతలు, కార్యకర్తలతో సమావేశం అయ్యాను. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం హామీల అమలులో ఘోరంగా వైఫల్యం చెందింది. ప్రభుత్వం అసమర్ధత పాలనపై గొంతు ఎత్తే ధైర్యం ఒక్క కాంగ్రెస్ పార్టీకే ఉంది. అలాగే కేంద్రంలోని బీజేపీని ఢీ కొట్టే దమ్ము కాంగ్రెస్ పార్టీతో మాత్రమే సాధ్యం. విభజన హామీలు నెరవేరాలన్నా, రాజధాని కట్టాలన్నా, రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలన్నా, పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే సాధ్యమవుతుంది. కాబట్టి సహజంగా పార్టీలో ఉండే చిన్న, చిన్న విబేధాలను పక్కన పెట్టి ప్రజా సమస్యలపై కలిసికట్టుగా పోరాటం చేయాలని దిశానిర్దేశం చేశాను’ అని షర్మిల ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ట్వీట్






