ఇలాంటి ప్రభుత్వం ఉంటే ఎంత? ఊడితే ఎంత?.. షర్మిల ఘాటు వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం(NDA Govt)పై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఇలాంటి ప్రభుత్వం ఉంటే ఎంత? ఊడితే ఎంత?.. షర్మిల ఘాటు వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం(NDA Govt)పై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా కీలక పోస్టు పెట్టారు. ‘‘ఆడలేక మద్దెల ఓడు అన్నట్లుంది కూటమి ప్రభుత్వ పనితీరు. యూరియా సకాలంలో ఇవ్వడం చేతకాక రోగాల పేరుతో రైతులను నిందించడం సిగ్గుచేటు. రాష్ట్రంలో యూరియా కొరత తీరేదెన్నడు.. రైతుల(AP Farmers) పంట పండేదెన్నడు? యూరియా అందించలేని కూటమి ప్రభుత్వం ఉంటే ఎంత? ఊడితే ఎంత?. యూరియా కొరతపై కూటమి ప్రభుత్వం చెప్తున్నవన్నీ కుంటి సాకులు. యూరియా ఎక్కువగా వాడుతున్నారని, క్యాన్సర్‌కి కారణం అవుతున్నారని, రాష్ట్రంలో టాప్-5లో క్యాన్సర్ రోగం ఉందని, ఏడాదికి ఒకే సారి వరి సాగు చేయాలని, యూరియా వాడుకుంటే 800 రూపాయలు ఇస్తామని, అసెంబ్లీ వేదికగా రైతులకు ఉచిత సలహాలు ఇవ్వడం నిజంగా హాస్యాస్పదం. రైతు సంక్షేమమే అజెండా అని చెప్పుకొనే కూటమి ప్రభుత్వం యూరియా సరఫరాలో చేతులెత్తేసింది.

ధాన్యాగారానికి అన్నపూర్ణ లాంటి రాష్ట్ర రైతులకు వ్యవసాయంపై నీతులు నేర్పడం కూటమి ప్రభుత్వ అవివేకానికి నిదర్శనం. యూరియా ఎక్కువ చల్లి రైతులు పండించే బియ్యం తినడానికి పనికిరావనడం రాష్ట్ర రైతాంగాన్ని అవమానించినట్లే. ఖరీఫ్ సీజన్‌లో 14 లక్షల హెక్టార్లలో వరి సాగువుతుంటే ఎంత యూరియా అవసరమో తెలియదా? రైతు సేవా కేంద్రాల వద్ద అన్నదాతల అగచాట్లు కనిపించడం లేదా? రాష్ట్రానికి రావలసిన యూరియా 6.65 లక్షల మెట్రిక్ టన్నుల కోటాలో ఇంకా లక్ష టన్నులు ఇవ్వకుండా కేంద్రం చోద్యం చూస్తుంటే.. మోడీని నిలదీసే దమ్ములేని మీరు రైతులదే తప్పు అన్నట్లు మాట్లాడటం నిజంగా బాధాకరం. ఉచిత సలహాలు పక్కన పెట్టి తక్షణం రాష్ట్ర రైతులకు సరిపడా యూరియా అందించండి. ఆ తర్వాత చేపట్టే సంస్కరణల మీద అవగాహన కల్పించండి’’ అని ట్వీట్‌లో షర్మిల పేర్కొన్నారు. ట్వీట్

Next Story