- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈ ఏడుపు ఎందుకు?.. షర్మిలను ప్రశ్నించిన బీజేపీ చీఫ్
ఈ ఏడుపు ఎందుకు?.. షర్మిలను ప్రశ్నించిన బీజేపీ చీఫ్

దిశ, వెబ్‌డెస్క్: మహాత్మా గాంధీ పేరుతో ఉన్న ఉపాధి హామీ పథకం పేరును మార్చుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఏపీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల(YS Sharmila) తప్పుబట్టిన విషయం తెలిసిందే. మోడీని 'అభినవ గాడ్సే' అని, 'నాథూరామ్ గాడ్సే వారసుడు' అని తీవ్రంగా విమర్శించారు. తాజాగా షర్మిల కామెంట్స్‌పై ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ మాధవ్(PVN Madhav) స్పందించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా షర్మిలకు కౌంటర్ ట్వీట్ పెట్టారు.
‘మహాత్ముడి పేరు అడ్డుపెట్టుకుని దశాబ్దాల పాటు దేశాన్ని దోచుకున్న మీరు నీతులు చెబుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది. ఉపాధి హామీ పథకంలో 'నకిలీ ఖాతాలు' సృష్టించి గాంధీజీ ఆశయాలను మీరు ఆనాడే చంపేశారు. పథకాలకు సర్దార్ పటేల్, సుభాష్ చంద్రబోస్, లాల్ బహదూర్ శాస్త్రీ వంటి మహనీయుల పేర్లను పెట్టకుండా ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీల పేర్లు పెట్టి ఒకే కుటుంబానికి దేశాన్ని ధారాదత్తం చేశారు.
కానీ ప్రధాని మోడీ.. గాంధీజీ కోరుకున్న 'గ్రామ స్వరాజ్యాన్ని' ఆచరణలో చూపుతూ, కొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. VB-G RAM G పేరుతో 100 రోజుల పనిని 125 రోజులకు పెంచి, పేదలకు ఎక్కువ ఉపాధి కల్పిస్తుంటే హర్షించాల్సింది పోయి, పేరు కోసం రాద్ధాంతం చేస్తారా?. దీనికి తోడు ఈ పథకం ద్వారా మోడీ వారంలోగా జీతాలు ఇవ్వడం చట్టబద్ధం చేస్తున్నారు. రైతులకు, కూలీలకు ప్రయోజనం చేకూర్చేందుకు 'హార్వెస్ట్ పాజ్' తీసుకొచ్చారు. అవినీతిని రూపుమాపి, అభివృద్ధికి బాటలేస్తున్న ఈ పథకాన్ని స్వాగతించాల్సింది పోయి ఈ ఏడుపు ఎందుకు?’ అని మాధవ్ ప్రశ్నించారు.






