- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆమరణ దీక్షకు దిగుతా: వైఎస్ షర్మిల సంచలన ప్రకటన
మహానేత, దివంగత సీఎం YSR విగ్రహాలపై దాడులు అత్యంత దారుణమని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. నంద్యాలలో వైఎస్సార్ విగ్రహాన్నిజంబులయ్య అనే వ్యక్తి ధ్వంసం చేయడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ...

దిశ, వెబ్ డెస్క్: మహానేత, దివంగత సీఎం YSR విగ్రహాలపై దాడులు అత్యంత దారుణమని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(PCC Chief YS Sharmila) అన్నారు. నంద్యాల(Nandyal)లో వైఎస్సార్ విగ్రహాన్ని(Ysr Statue) జంబులయ్య అనే వ్యక్తి ధ్వంసం చేయడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ విగ్రహాన్ని ధ్వంసం చేస్తుంటే కూటమి ప్రభుత్వం చోద్యం చూడటం సిగ్గుచేటన్నారు. ఇది చంద్రబాబు రాజకీయ కక్ష్యకు నిదర్శనని ఎద్దేవా చేశారు. నంద్యాల జిల్లా శ్రీనివాస సెంటర్ వద్ద పట్టపగలు ఓ సైకో వైఎస్ విగ్రహంపై దాడి చేస్తుంటే పోలీసులు ఉండి కూడా ఆపకపోవడం హేయమైన చర్య అని షర్మిల మండిపడ్డారు. మానసిక స్థితి బాగోలేదని, మనిషే కాదని, సంయమనం పాటించాలని ఉచిత సలహాలు ఇవ్వడం పోలీసు యంత్రాంగానికి తగదని షర్మిల సూచించారు.
కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం..
‘‘విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలి. సైకో వెనుక ప్రభావిత శక్తులు ఎవరున్నారో తేల్చాలి. పాత విగ్రహం స్థానంలో తక్షణం కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేయించాలి. రాష్ట్రంలో YSR విగ్రహాలపై దాడులు అరికట్టేందుకు ప్రభుత్వమే భాద్యత వహించాలి. వెంటనే YSR విగ్రహాన్ని ఏర్పాటు చేయకపోతే నంద్యాలలో అదే సెంటర్ వద్ద ఆమరణ దీక్షకు దిగుతాం.’’ అని వైఎస్ షర్మిల హెచ్చరించారు.






