- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇంధన సంక్షోభంపై.. వైఎస్ షర్మిల సంచలన డిమాండ్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే అత్యవసర పరిస్థితిగా గుర్తించాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన తాము డిమాండ్ చేస్తున్నామని వైఎస్ షర్మిల అన్నారు. రాష్ట్రంలో నెలకొన్న పెట్రల్, డీజిల్ కొరతపై ఆమె స్పందించారు..

దిశ, వెబ్ డెస్క్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే అత్యవసర పరిస్థితిగా గుర్తించాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన తాము డిమాండ్ చేస్తున్నామని వైఎస్ షర్మిల(YS Sharmila) అన్నారు. రాష్ట్రంలో నెలకొన్న పెట్రోల్(Petrol), డీజిల్(Diesel) కొరతపై ఆమె స్పందించారు. డిమాండ్‌కి తగ్గ సప్లై ఉండేలా చర్యలు చేపట్టాలని, 24 గంటల డెడ్ లైన్‌లా ప్రభుత్వం పని చేయాలని ఆమె తెలిపారు. ఇంధనం కొరతకు లోపం ఎక్కడుందో గుర్తించాలన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరగకుండా అప్రమత్తం అవ్వాలని సూచించారు. ఇంధనం కొరత ప్రభావం ప్రజా జీవనంపై పడకుండా చూడాలన్నారు. రాష్ట్రంలో ఇంధన సంక్షోభంపై కూటమి ప్రభుత్వం వెంటనే నిద్రమత్తు వీడాలని చెప్పారు. అమ్మకాలు, ఆందోళనల పేరుతో మసిపూసి మారేడు కాయ చేయాలని చూస్తే కుదరదని హెచ్చరించారు.
సమీక్షలు, సలహాలతో..
‘‘సమీక్షలు, సలహాలతో ప్రజల ఇంధన కొరత తీరదు చంద్రబాబు. పెట్రోల్ లేదు. డీజిల్ లేదు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వమే లేదు. ప్రజలకు కనీసం ఫ్యుయల్ కొరత లేకుండా చూడలేనోళ్లు..రాష్ట్రాన్ని ఉద్దరిస్తారట. ఉట్టికి ఎగరలేనమ్మ.. ఆకాశానికి ఎగురుతా అన్నట్లుంది కూటమి ప్రభుత్వ తీరు. దేశంలో ఎక్కడా లేని ఇంధనం కొరత ఏపీలోనే ఏర్పడినందుకు చంద్రబాబు గారు సిగ్గుపడాలి. రాష్ట్ర ప్రజలకు ఇంధన కష్టం కూటమి ప్రభుత్వం విధించిన శాపం. సరిపడా ఇంధనం అందక ప్రజలు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. ఎర్రటి ఎండలో జనాలను కిలోమీటర్ల మేర నిలబెట్టడం. పెట్రోల్, డీజిల్ లేదని నో స్టాక్ బోర్డులు తగిలించడం కూటమి పాలనా వైఫల్యానికి నిదర్శనం. 70 శాతం బంకులు బంద్ పెట్టడం అత్యంత దారుణం. మోడీకి మద్దతు ఇచ్చి ప్రధాని పీఠంపై కూర్చోబెట్టిన రాష్ట్రానికి ఈ దుస్థితి పట్టడం బాధాకరం.’’ అని వైఎస్ షర్మిల విమర్శించారు.






