వారికే ఈ మదర్స్ డే అంకితం: వైఎస్ షర్మిల

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-05-11 07:43:41  IST  )

వారికే ఈ మదర్స్ డే అంకితమని వైఎస్ షర్మిల అన్నారు..

వారికే ఈ మదర్స్ డే అంకితం: వైఎస్ షర్మిల
X

దిశ, వెబ్ డెస్క్: మాతృభూమి రక్షణ కోసం అసువులు బాసిన జవాన్ మురళి నాయక్(Jawan Murali Naik) లాంటి వీరులను కన్న తల్లులకు, మన దేశ రక్షణ కోసం కన్నప్రేమను పణంగా పెట్టిన వీరమాతలకు ఈ మదర్స్ డే(Mothers Day) అంకితమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(Ys Sharmila) అన్నారు. . మదర్స్ డే సందర్భంగా ఆమె ట్వీట్ చేశారు. ఈ దేశ ముద్దుబిడ్డలు మన సైనికులు. ఇలాంటి రక్షకులకు జన్మనిచ్చిన ప్రతి తల్లికి మాతృదినోత్సవ శుభాకాంక్షలు. యుద్ధ భూమిలో బిడ్డను కోల్పోయిన దుఃఖాన్ని దిగమింగుతూ దేశం కోసం ప్రాణత్యాగం చేశాడనే గర్వాన్ని చూపే అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. మనిషి జన్మకు, గమనానికి మూలం అమ్మ. ఈ సృష్టిలో అమ్మ ప్రేమకు సమానమైనది మరొకటి లేదు. అమ్మ ప్రేమ, దీవెనలే మనకు కొండంత అండ.’’ అని షర్మిల తెలిపారు.

Next Story