రాష్ట్ర ప్రయోజనాలే మా స్టాండ్: బనకచర్లపై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |

బనకచర్లపై రాష్ట్ర ప్రయోజనాలే తమ స్టాండ్ అని వైఎస్ షర్మిల తెలిపారు...

రాష్ట్ర ప్రయోజనాలే మా స్టాండ్: బనకచర్లపై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: బనకచర్ల(Banakacharla)పై రాష్ట్ర ప్రయోజనాలే తమ స్టాండ్ అని వైఎస్ షర్మిల(YS Sharmila) తెలిపారు. బనకచర్లతో తమకు నష్టం జరుగుతుందని తెలంగాణ(Telangana) నేతలు అంటున్న నేపథ్యంలో ఆమె స్పందించారు. రాష్టప్రయోజనాల కోసం అని పార్టీలతో కలిసి నీటి హక్కుల కోసం పోరాడుతామన్నారు. అలాగే విభజన హామీలు నెరవేరాలంటే రాష్ట్రంలోనూ, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో రావాలని ఆకాంక్షించారు.

‘‘కేంద్రంలో రాహుల్ ప్రధాని అవ్వాలి. ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేశారు. పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు తగ్గించి అన్యాయం చేస్తున్నారు. పోలవరాన్ని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కింద మార్చారు. పోలవరం ప్రాజెక్ట్‌ను నీటి నిల్వ కోసం కట్టిన బ్యారేజ్‌గా మార్చారు. ఎత్తు 45 నుంచి 41 ఎత్తు తగ్గిస్తుంటే అడిగే ఒక్క మగాడు లేడు. పార్లమెంట్‌లో ఒక్కడు కూడా నోరు విప్పలేదు. టీడీపీ,YCP,జనసేన ఎంపీలు ఒక్కడికి దమ్ము లేదు. 80 వేల కుటుంబాలకు R&R నిధులు మిగిలించడానికి పోలవరాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. మూడు పార్టీలు మోడీకి తొత్తులుగా మారి పని చేస్తున్నారు.’’ అని విమర్శించారు.

రాష్ట్ర బాధ్యత తనదని ప్రధాని మోడీ సైతం మోసం చేశారని షర్మిల వ్యాఖ్యానించారు. మోడీ నాయకత్వంలో రాష్ట్రం బాగుపడదని ఆమె విమర్శించారు. ‘‘విభజన సమస్యలు అమలు కావు. రాజధాని నిర్మాణం బాధ్యత కేంద్రానిది. విభజన చట్టంలోనే రాజధాని నిర్మాణం కి కేంద్రం నిధులు ఇవ్వాలని ఉంది. నిధులకు బదులు ఇప్పుడు అప్పులు ఇస్తున్నారు. అప్పులు ఇచ్చి రాష్ట్రం నెత్తిన భారం మోపుతున్నారు. బీజేపీ ఇంత అన్యాయం చేస్తుంటే బాబు,పవన్ కూటమి కట్టారు. మోడీ అన్యాయాన్ని ప్రశ్నించకుండా దాసోహం అంటున్నారు. మోడీకి రాష్ట్రంలో యోగా కావాలి కానీ ప్రజల సమస్యలు అక్కర్లేదు. యోగా మీద ఉన్న శ్రద్ధ రాష్ట్ర ప్రజల మీద లేదు.’’ అని వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు.

Next Story