వైఎస్ జగన్‌పై కేసులు: షర్మిల సంచలన వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |

సింగయ్య మృతి ఘటన విషయంలో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి మండిపడ్డారు..

వైఎస్ జగన్‌పై కేసులు:  షర్మిల సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: సింగయ్య మృతి ఘటన విషయంలో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి(Ys Jagan Mohan Reddy)పై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(Ap Pcc Chief Ys Sharmila) మరోసారి మండిపడ్డారు. జగన్ రెంటపాళ్ల పర్యటనలో కారు ఢీకొని సింగయ్య మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఘటనలో జగన్ తప్పు ఉందని వైఎస్ షర్మిల ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ఆమె గుంటూలో మాట్లాడుతూ సింగయ్య మృతిలో జగన్ తప్పు చేయలేదా అని ప్రశ్నించారు. 3 కార్లకే పోలీసులు అనుమతి ఇస్తే వేల మందితో ఎందుకు పర్యటన చేశారని షర్మిల నిలదీశారు. కారు కింద పడిన వ్యక్తిని జగన్ పట్టించుకోకుండా వెళ్లిపోవడందారుణమన్నారు. ఇప్పటికే జగన్ చాలా తప్పులు చేశారని, అందుకే ఆయనపై కేసులు నమోదు అయ్యాయని షర్మిల వ్యాఖ్యానించారు.

సింగయ్య మృతి ఘటనలో అటు పోలీసుల తీరునూ షర్మిల తప్పుబట్టారు. గప్ వేల మందితో వస్తుంటే అడ్డుకోకుండా చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు. జగన్ ఏ పర్యటన చేసినా జనాల సమీకరణ, బలప్రదర్శన కోసమేనని విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు జగన్ ఏ సమస్యను పట్టించుకోలేదని ఆరోపించారు. జగన్ ప్రదర్శనలను నిషేధించాలని షర్మిల డిమాండ్ చేశారు.

Next Story