మంత్రి స్టేట్మెంట్ పచ్చి అబద్ధం: కాంగ్రెస్

by Gantepaka Srikanth |   (  Updated:2025-05-05 16:52:07  IST  )

రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం(NDA Govt)పై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) సీరియస్ కామెంట్స్ చేశారు.

మంత్రి స్టేట్మెంట్ పచ్చి అబద్ధం: కాంగ్రెస్
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం(NDA Govt)పై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) సీరియస్ కామెంట్స్ చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ‘రాష్ట్రంలో అకాల వర్షాల వలన ఆస్తి, ప్రాణ, పంట నష్టం తీవ్రంగా జరిగింది. ఎక్కడ చూసినా తడిచిన ధాన్యం. రాలిపోయిన మామిడి, కూలిపోయిన అరటి కనిపిస్తోంది. దాదాపు 5 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది అని అంచనా. ఇప్పటివరకు ఎంత నష్టం జరిగింది అని ప్రభుత్వం లెక్కలు కూడా తీయలేదు. ఈసారి దాదాపు 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండింది. కానీ ప్రభుత్వం కొన్నది మాత్రం కేవలం 13 లక్షల మెట్రిక్ టన్నులే. ఇంకా 17 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రైతుల దగ్గరే ఉంది. ఇప్పుడు ఆ ధాన్యం ఎవరు కొనాలి ? చివరి గింజ వరకు కొంటాం అని ఇచ్చిన హామీ ఏమయింది? తెలంగాణలో ఇదే పరిస్థితి ఏర్పడితే... అక్కడ ప్రభుత్వం విదేశాలకు నేరుగా బియ్యం ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఫిలిప్పీన్స్, మలేషియా దేశాలతో తెలంగాణ ప్రభుత్వం MOU చేసుకుంది. ఈ ప్రభుత్వం మిల్లర్ల మీద ఒత్తిడి చేయకుండా.. నేరుగా విదేశాలకు బియ్యం ఎక్స్పోర్ట్ చేయొచ్చు కదా ? మీ నిర్లక్ష్యం రైతుల పాలిట శాపం కావాలా? రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉంది.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులను మోసం చేసింది. ఏ పంటకు మద్దతు ధర లేదు. కనీస మద్దతు ధర అందక రైతులు నష్టపోతున్నారు. ఈ కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. రైతులను దగ చేస్తూ.. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ధరల స్థిరీకరణ కింద రూ.6వేలు ఇప్పటివరకు ఖర్చు చేశారట. ఇదంతా పచ్చి అబద్ధం. మీరు అధికారంలో వచ్చి 10 నెలలు కాలేదు. 10 నెలల్లో రూ.6వేల కోట్లు ధరల స్థిరీకరణ కింద ఎలా ఖర్చు చేశారు? రూ.6వేల కోట్లపై వ్యవసాయ శాఖ వెంటనే శ్వేతపత్రం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం’ అని షర్మిల డిమాండ్ చేశారు.

Click For Tweet Post..

Next Story