- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మీ రాక్షస ఆనందం కోసం ఇద్దర్ని బలి ఇస్తారా: జగన్‌పై షర్మిల ఫైర్
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ...

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(Former Cm Jagan Mohan Reddy)పై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ షర్మిల(Ys Sharmila) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రెంటపాళ్ల పర్యటనలో జగన్ కారు కిందపడి సింగయ్య అనే వృద్ధుడు చనిపోవడంపై ఆయన మండిపడ్డారు. వైఎస్ జగన్(Ys Jagan) వాహనం కింద పడి సింగయ్య నలిగిపోయిన దృశ్యాలు భయానకమని, ఒళ్ళు గగుర్పొడిచేలా ఆ ఘటన ఉందన్నారు. కారు కింద ఒక వ్యక్తి పడ్డారన్న సోయి లేకుండా కాన్వాయ్ కొనసాగడం ఏంటని ప్రశ్నించారు. 100 మందికి పర్మిషన్ ఇస్తే వేల మంది ముందు సైడ్ బోర్డు మీద నిలబడి జగన్ చేతులూపడం ఏంటని నిలదీశారు. ప్రజల ప్రాణాలు తీసే హక్కు తమకు ఎవరిచ్చారని మండిపడ్డారు. బెట్టింగ్‌లో ఓడిపోయి సూసైడ్ చేసుకున్న వ్యక్తి విగ్రహ ఆవిష్కరణకు ఇద్దరిని బలి ఇస్తారా అని ప్రశ్నించారు. ఇదేం రాజకీయమని, ఇదెక్కడి రాక్షస ఆనందమని, తమ ఉనికి కోసం జనాలను టైర్ల కింద తొక్కుకుంటూ పోతారా? అంటూ వైఎస్ షర్మిల ప్రశ్నించారు.
‘‘ప్రజల ప్రాణాల మీద శవ రాజకీయాలు చేస్తారా?. కారు సైడ్ బోర్డ్ మీద నిలబడి ఒక నాయకుడిగా కాన్వాయ్ మూవ్ చేయించడం సబబేనా?. ఇది పూర్తిగా జగన్ బాధ్యత రాహిత్యానికి అద్దం పడుతుంది. బలప్రదర్శన చేసి సింగయ్య మృతికి కారణమైన జగన్. 100 మందికి అనుమతి ఇచ్చి వేల మందితో వచ్చినా దగ్గరుండి మరి చోద్యం చూసిన కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలి. పర్మిషన్‌కి విరుద్ధంగా జన సమీకరణ జరుగుతుంటే పోలీసులు ఎలా సహకరించారు?. ఎందుకు ప్రేక్షక పాత్ర వహించారు?. ఎందుకు ఇంటలిజెన్స్ వ్యవస్థను నిద్ర పుచ్చారు?.’’ అని షర్మిల మండిపడ్డారు.
ట్విట్టర్ లింక్ కోసం క్లిక్ చేయండి..






